News
ZIM vs BAN 3rd T20 Highlights, ZIM vs BAN: బంగ్లాదేశ్‌కి టీ20 సిరీస్‌లో జింబాబ్వే లాస్ట్ పంచ్ – zimbabwe beat bangladesh by 10 runs in 3rd t20i
మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఆ జట్టులో లోయర్ ఆర్డర్ బ్యాటర్ రియాన్ బుర్ల్ (54: 28 బంతుల్లో 2×4, 6×6) హాఫ్ సెంచరీ నమోదు చేయగా.. చివర్లో జాంగ్వే (35: 20 బంతుల్లో 4×4, 2×6) కూడా విలువైన పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహదీ హసన్, హసన్ మహ్మద్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. నసుమ్ అహ్మద్, హొసెన్, ముస్తాఫిజుర్‌కి చెరొక వికెట్ దక్కింది.
157 పరుగుల లక్ష్యఛేదనలో ఆరంభం నుంచి బంగ్లాదేశ్ తడబడింది. ఓపెనర్ లిట్టన్ దాస్ (13) రెండో ఓవర్లోనే పెవిలియన్‌కి చేరిపోగా.. మహ్మదుల్లా (27), శాంటో (16), కెప్టెన్ హొసెన్ (0) నిరాశపరిచారు. అయినప్పటికీ.. ఆపిఫ్ హొసెన్ (39 నాటౌట్: 27 బంతుల్లో 3×4), మెహదీ హసన్ (22: 17 బంతుల్లో 2×4, 1×6) చివర్లో పోరాడారు. కానీ.. లాభం లేకపోయింది. ఛేదనలో బంగ్లాదేశ్ టీమ్ 146/8కే పరిమితమైంది. ఇక శుక్రవారం నుంచి బంగ్లాదేశ్, జింబాబ్వే మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది.