News
ys sharmila sircilla, శవాల మీద రాజకీయం చేయకండి.. షర్మిల ముఖం మీదే చెప్పేసిన నవీన్ కుటుంబసభ్యులు – ys sharmila had an unexpected experience when she went to visit naveen family members
మరోవైపు.. నవీన్ అసలు గ్రూప్-1 కనీసం అప్లై కూడా చేయలేదని తేల్చేశారు. గ్రూప్-1 పేపర్ లీకేజీ కావటం వల్లే మనస్తాపంతో చనిపోయాడంటూ దాంతో లింక్ చేసి వార్తలు తెగ వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు. తమ 30 ఏళ్ల కొడుకు చనిపోవటం పట్ల ఆత్మ క్షోభ అనుభవిస్తుంటే.. ఇలాంటి వార్తల వల్ల మరింత కుంగిపోయే అవకాశం ఉందని చెప్పొకొచ్చారు. ఈ ఊహించని పరిణామంతో.. అటు షర్మిల, ఆమెతో వచ్చిన నేతలంతా సైలెంట్ అయిపోయారు.
‘శవాల మీద రాజకీయం చేయకండి.. దయచేసి..’ షర్మిలతో నవీన్ తండ్రి
అనంతరం మీడియా ముందుకొచ్చిన షర్మిల.. ఉద్యోగం దొరకక నవీన్ ఆత్మహత్య చేసుకోవటం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నవీన్ కుటుంబం బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్లని తెలిసినా.. మానవత్వంతో పరామర్శించేందుకు వచ్చినట్టు తెలిపారు. నవీన్ ఆత్మహత్య చేసుకున్నది నిరుద్యోగంతోనే అని షర్మిల తెలిపారు. ఉద్యోగాలు ఇస్తే యువత ఎందుకు సూసైడ్లు చేసుకుంటారని ప్రశ్నించారు. కనీసం ప్రైవేట్ సెక్టార్‌లో అయినా ఉద్యోగాల కల్పన లేదన్నారు. ప్రైవేట్ ఉద్యోగాలను కల్పించి ఉంటే నవీన్‌లాంటి యువకులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని షర్మిల ప్రశ్నించారు.
- Read More Telangana News And Telugu News