News

ys sharmila, ఎన్టీఆర్ శతజయంతి.. అన్నగారిపై వైఎస్ షర్మిల ఆసక్తికర ట్వీట్ – ysr telangana party chief ys sharmila tributes to nandamuri taraka ramarao


Authored by Ramprasad | Samayam Telugu | Updated: 28 May 2023, 8:40 pm

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా.. వైఎస్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఘనంగా నివాళులర్పించారు. ఈ క్రమంలో.. ఆసక్తికర ట్వీట్ చేశారు. ఎన్టీఆర్‌ను కొనియాడుతూ ట్వీట్ చేశారు.

 

షర్మిల

ప్రధానాంశాలు:

  • ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా వైఎస్ షర్మిల ట్వీట్
  • అన్నగారి సేవలను కొనియాడుతూ ట్వీట్
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు.. తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక స్వర్గీయ నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకలను రెండు తెలుగు రాష్ట్రాలు ఘనంగా జరుపుకుంటున్నాయి. ఈ క్రమంలో.. రాజకీయాలకతీతంగా నేతలు అన్నగారికి నివాళులర్పిస్తూ.. ఆయన సేవలను కొనియాడుతున్నారు. ఈ క్రమంలోనే.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆసక్తికర ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా.. ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తూ… ఆయన సేవలను కొనియాడారు.

“తెలుగు ప్రజలకు గుర్తింపు తెచ్చిన సినీ, రాజకీయ మేరునగ శిఖరం.. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారు. పేదల సంక్షేమమే శ్వాసగా బతికి అనేక సంస్కరణలతో తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి వైపు నడిపించి.. పేదలకు కూడు, గూడు, గుడ్డ ప్రాథమిక అవసరాలుగా గుర్తించి, పేదరిక నిర్మూలనకు కృషి చేశారు. ఉన్నత విలువలతో కూడిన రాజకీయాలతో అందరినీ మెప్పించి, ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఈరోజు ఎన్టీఆర్ గారి శత జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. వారికి ఘన నివాళులు.” అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.
మరోవైపు.. బీఆర్ఎస్ నేతలు సైతం.. ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులర్పించారు. హనుమకొండలో ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. విశ్వ విఖ్యాత నటుడిగా.. పరిపాలనాదక్షుడిగా ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతారని ఎర్రబెల్లి కొనియాడారు. రెండు రూపాయలకే కిలో బియ్యం, పేదలకు ఇండ్లు ఇచ్చి.. ఎన్టీఆర్ పేదల పెన్నిధిగా నిలిచారని కొనియాడారు. ఎన్టీఆర్‌‌కు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ నివాళులర్పించారు. హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ ఘాట్‌లోని ఆయన సమాధి వద్ద పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఎన్టీఆర్ తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

‘ఈ గవర్నర్లు ఏందీ.. ఏం జరుగుతోంది ఈ దేశంలో..’

డింపుల్ హయాతీ ఇంకో ట్వీట్.. ఈసారి ‘సింహా’ను రంగంలోకి దింపిందిగా..!

  • Read More Telangana News And Telugu News

సమీప నగరాల వార్తలు

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Advertisement

Related Articles

Back to top button