News

ys jagan mohan reddy, జగనన్న కోసం.. పసిపాపతో కాలినడకన తిరుమలకు దంపతులు, కదిలించే కారణం – couple from west godavari reach tirumala on foot with child, expressing gratitude on cm jagan


సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ.. తమ పసిపాపను ఎత్తుకొని కాలినడకన తిరుమల కొండ ఎక్కారు దంపతులు. తమ పాపకు వచ్చిన కష్టాన్ని తలచుకొని కుమిలిపోతుండగా.. చికిత్స కోసం కోటి రూపాయలు విడుదల చేసి పెద్ద మనసు చాటుకున్న ముఖ్యమంత్రి జగనే తమ దేవుడు అంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం అయోధ్యలంక గ్రామానికి చెందిన రాంబాబు, నాగలక్ష్మి దంపతులు. తమ ఊరి నుంచి తిరుమల వరకూ పాదయాత్రగా వచ్చి తిరుమల కొండ ఎక్కారు. సీఎం జగన్‌పై ఆ దంపతులకు ఎందుకు అంత అభిమానం? ఆ చిన్నారికి వచ్చిన కష్టం ఏంటి?

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం అయోధ్యలంక గ్రామానికి చెందిన రాంబాబు, నాగలక్ష్మి దంపతుల కుమార్తె పేరు హనీ. పుట్టుకతోనే ఆ పాపకు గాకర్స్ వ్యాధి వచ్చినట్లు తేలింది. ఈ వ్యాధి బారిన పడిన వారిలో కాలేయం పనిచేయదు. చికిత్స కోసం కోటి రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో ఏం చేయాలో పాలుపోక ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

కొన్ని రోజుల కిందట గోదావరి వరద బాధిత ప్రాంతాల పర్యటనలో భాగంగా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. కోనసీమ జిల్లా పర్యటనకు వచ్చారు. నాడు కిక్కిరిసిన జనం మధ్య ఆ పాపను పైకెత్తి పట్టుకున్న తల్లిదండ్రులను చూసి, సీఎం జగన్ తన కాన్వాయ్‌ను ఆపించారు. ఆ తల్లి వద్దకు వెళ్లి పాప సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు. తమ చిన్నారి కష్టం గురించి ఆ జంట వివరించింది. దీంతో చలించిపోయిన సీఎం జగన్.. ఆ పాప ఖర్చకయ్యే మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.

జగనన్న కోసం.. పసిపాపను ఎత్తుకొని కాలినడకన తిరుమలకు

సీఎం ఆదేశాలతో ఈ మొత్తం విడుదల కాగా.. ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ తమ దేవుడు అంటూ తిరుమలకు పాదయాత్రగా బయల్దేరారు రాంబాబు, లక్ష్మీ దంపతులు. వందల కిలోమీటర్లు నడిచి వచ్చి తిరుమలకు చేరుకున్నారు. తమ చిన్నారిపై దయచూపమని ఏడుకొండలవాడిని కోరుకుంటే, సీఎం జగన్ రూపంలో కరుణించారని కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. తమ చిన్నారితో పాటు సీఎం జగన్‌ను ఆయురారోగ్యాలతో ఉండేలా దీవించాలని వేంకటేశ్వరస్వామిని మొక్కుకున్నారు.

Hyd: సీపీఆర్ చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్.. గ్రేట్ జాబ్ సార్
అంత్యక్రియల బిజినెస్.. 2 వేల కోట్ల టర్నోవర్, ఫెయిర్‌లో ప్రత్యేక ఆకర్షణగా! పేరేంటో తెలుసా?
Read Latest Andhra Pradesh News and Telugu News

Advertisement

Related Articles

Back to top button