News
ys jagan mohan reddy, క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో సీఎం జగన్ సమావేశం.. కీలక హామీలు! – cm ys jagan mohan reddy meeting with christian leaders
క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి హాజరైన క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో సీఎం జగన్ మాట్లాడారు ఈ సందర్భంగా బిషప్‌లు, రెవరెండ్‌లు ఇతర క్రైస్తవ సంఘాల ప్రతినిధులు తమ సమస్యలను ముఖ్యమంత్రి జగన్‌కు నివేదించారు. చర్చిల ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్న విషయాన్ని సీఎం జగన్ దృష్టికి ఏపీ ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ తరపున హాజరైన క్రైస్తవ సంఘాల ప్రతినిధులు వివరించారు.
ఎస్పీ, కలెక్టర్‌లు జిల్లా స్థాయిలోనే సమస్యలు పరిష్కరిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. అలాగే, క్రిస్టియన్ సమాజం, సంఘాల ప్రతినిధుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించేందుకు ఒక సలహాదారును నియమిస్తామని వెల్లడించారు. దీని వల్ల సమస్యలను సులభంగా పరిష్కరించే వెసులుబాటు ఉంటుందన్నారు. క్రిస్టియన్లకు శ్మశానవాటికల ఏర్పాటు పైనా సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు.