ys jagan, ఆ ఉద్యోగుల జీతాల సమస్యకు చెక్.. జగన్ సర్కారు కీలక నిర్ణయం – cm ys jagan mohan reddy solve outsourcing employees salary problems
ఈ విషయం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున దృష్టికి రావడంతో వారి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో ప్రస్తుతం థర్డ్ పార్టీ విధానంలో పని చేస్తున్న ఈ ఉద్యోగుల సేవలను ప్రీ మెట్రిక్ ఎస్సీ హాస్టళ్లలో ఇది వరకే మంజూరైన పోస్టుల స్థానంలో ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. అలాగే, వారి వేతనాలను ఆప్కాస్ ద్వారా ప్రతి నెలా అందరితో పాటుగా చెల్లించాలిని అధికారులు ప్రతిపాదించగా, మంత్రి మేరుగు నాగార్జున.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దృష్టి తీసుకెళ్లారు. ఈ ప్రతిపాదనకు సీఎం జగన్ ఆమోదముద్ర వేశారు.
దీంతో ఈ ఉద్యోగులు ఇప్పటి వరకు వేతనాల కోసం పడుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయాయి. ప్రస్తుతం ఆప్కాస్‌కు అనుసంధానం చేసిన 411 మంది పోస్ట్ మెట్రిక్ ఎస్సీ హాస్టల్ ఉద్యోగుల్లో 37 మందిని శ్రీకాకుళం, 52 మందిని విజయనగరం, 17 మందిని విశాఖపట్నం, 120 మందిని తూర్పు గోదావరి, 82 మందిని కృష్ణా, 62 మందిని ప్రకాశం, 41 మందిని అనంతపురం జిల్లాలకు చెందిన హాస్టళ్లకు కేటాయిస్తూ సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.