News

ys jagan, అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీని వేగవంతం చేయాలి.. సీఎం జగన్ ఆదేశాలు – cm ys jagan mohan reddy review meeting over ap housing scheme


రాజధాని అమరావతి ప్రాంతంలో ఇళ్ల స్థలాల పంపిణీతో పాటు టిడ్కో ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖపై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నవరత్నాలు పథకాల్లో భాగంగా పేద ప్రజలందరికీ ఇళ్లు కార్యక్రమంపై అధికారులు సీఎం జగన్మోహన్ రెడ్డికి వివరాలు అందించారు.గడిచిన 45 రోజుల్లో హౌసింగ్‌ కోసం రూ. 1,085 కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి జగన్‌కు అధికారులు వివరించారు. ఇప్పటి వరకు 3.70 లక్షల ఇళ్లు పూర్తి చేశామని, రూఫ్‌ లెవల్‌.. ఆ పైన నిర్మాణంలో ఉన్నవి 5.01 లక్షల ఇళ్లు అని అదిధికారులు వెల్లడించారు. ఇక, బేస్‌మెంట్‌ లెవల్‌ దాటి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్లు 8.64 లక్షలు పైనే ఉన్నాయని పేర్కొన్నారు. త్వరలోనే వీటి నిర్మాణాలు పూర్తవుతాయని.. మరో 45 రోజుల్లో వీటిని పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. రాజధాని ప్రాంతమైన సీఆర్డీయే పరిధిలో పేద ప్రజలకు ఇళ్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, ఎన్ని ఆటంకాలు ఎదురైనా, నాణ్యమైన పనులు చేపట్టి, లబ్ధిదారుల కల సాకారం చేయాలన్నారు.

అలాగే, ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన అనంతరం వేగంగా నిర్మాణ పనులను ముందుకు తీసుకెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఇళ్లు లేని నిరుపేదలకు సాధ్యమైనంత త్వరగా ఇళ్లు కట్టించి అప్పగించడంపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని అధికారులకు సూచించారు. పేద ప్రజలకు ఎంత త్వరగా ఇళ్లు సమకూరిస్తే.. వారి జీవితాలు అంతగా బాగుపడతాయని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. సీఆర్డీఏ ప్రాంతంలో పట్టాల పంపిణికీ అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ల్యాండ్‌ లెవలింగ్‌ పనులు మెదలుకొని మిగిలిన అన్ని పనులను త్వరలోనే కొలిక్కి తీసుకురావాలన్నారు.

సీఆర్డీయే ప్రాంతంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంతో పాటు నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇందులో భాగంగా 5024 టిడ్కో ఇళ్లను ప్రభుత్వం పంపిణీ చేస్తోందని.. ఇది దేశ చరిత్రలోనే రికార్డుగా పేర్కొన్నారు. అర్హులను గుర్తించి పారదర్శకంగా ఇళ్ల పంపిణీ చేయటంలో అధికారులు కీలకంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు.

పార్టీని అమ్ముకునే ప్యాకేజ్ స్టార్.. పవన్‌పై సీఎం జగన్ సెటైర్లు

Related Articles

Back to top button