News

ys jagan, అందర్నీ ఆంధ్రాకు ఆహ్వానిస్తున్నా.. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుపై సీఎం జగన్ అప్డేట్ – cm ys jagan mohan reddy welcome to people for ap global investors summit


విశాఖపట్నంలోని ఏయూ గ్రౌండ్స్‌లో మార్చి 3, 4 తేదీల్లో జరగనున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు ఏర్పాట్లపై సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగిన ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్‌ కరికాల వలవన్‌, ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్‌ ఎస్‌‌ఎస్ రావత్‌, సమాచార శాఖ కమిషనర్ టి.విజయ్‌కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.

సమీక్షలో భాగంగా కార్యక్రమాల షెడ్యూల్‌ను అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. వేదిక వద్ద జరుగుతున్న పనులు, తదితర అంశాలను తెలిపారు. ఈ సదస్సుకు వస్తున్న కేంద్ర మంత్రులు, వ్యాపారవేత్తలు తదితర వివరాలను సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా సదస్సు నిర్వహణలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలు సూచనలు చేశారు.

మరోవైపు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సోమవారం రాత్రి ట్వీట్‌ చేశారు. ‘‘విశాఖపట్నంలో మార్చి 3, 4 తేదీల్లో జరగనున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కోసం ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్ వైవిద్యం, చైతన్యాన్ని ఆస్వాదించండి. అందరినీ కలిసేందుకు ఎదురు చూస్తున్నాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.

Related Articles

Back to top button