ys avinash reddy, వైఎస్ అవినాష్ రెడ్డి పిటిషన్‌పై నేడు హైకోర్టులో తీర్పు.. వైసీపీలో తీవ్ర ఉత్కంఠ! – telangana high court will give judgment on ys avinash reddy petition
తన వాంగ్మూలాన్ని ఆడియో, వీడియో రికార్డు చేయాలని వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేసినా సీబీఐ అధికారులు పట్టించుకోవడం లేదని.. జనవరి 28న, ఫిబ్రవరి 24న రెండు దఫాలు సీబీఐ తనను విచారించిందని వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. అన్ని వివరాలూ వెల్లడించినప్పటికీ.. ఇంకా ఇబ్బంది పెడుతోందన్నారు. తన స్టేట్‌మెంట్‌ను ఆడియో వీడియో రికార్డు చేయడంతో పాటు స్టేట్‌మెంట్ కాపీని ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. విచారణకు తనతో పాటు న్యాయవాదిని సైతం అనుమతించేలా ఆదేశించాలని తెలంగాణ హైకోర్టును అవినాష్ రెడ్డి కోరారు.
తన పిటిషన్‌పై విచారణ ముగిసే వరకు సీఆర్పీసీ సెక్షన్ 161 కింద సీబీఐ తనను విచారించకుండా స్టే విధించాలని.. అరెస్టు సహా ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఆదేశాలు జారీ చేయాలని అవినాష్ రెడ్డి కోరారు. అవినాష్ రెడ్డి విచారణకు సంబంధించి వీడియోగ్రఫీ, ఆడియోగ్రఫీ, కేసు వివరాలను షీల్డ్ కవర్‌లో కోర్టుకు సీబీఐ సమర్పించింది. మొత్తం 35 సాక్షుల స్టేట్‌మెంట్లు, 10 డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్‌లు కోర్టుకు సమర్పించింది. హత్య జరిగిన ప్రాంతంలో దొరికిన లేఖ, ఎఫ్‌ఎస్ఎల్ నివేదికను కూడా హైకోర్టుకు సీబీఐ అందజేసింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును 17వ తేదీకి (శుక్రవారం) రిజర్వ్ చేసింది. దీంతో హైకోర్టు తీర్పుపై అవినాష్ రెడ్డితో పాటు వైసీపీలోనూ ఉత్కంఠ నెలకొంది.