Vaishnav Tej: షూటింగ్ సెట్లో బోరున ఏడ్చేసిన హీరో.. ఒక మాట చెప్పమంటే కన్నీళ్లు వచ్చేసాయంటున్న వైష్ణవ్ తేజ్..
అయితే తాను ఉప్పెన సినిమా షూటింగ్ సెట్ లో ఎమోషనల్ అయ్యాయని.. డైలాగ్ చెప్పడంలో ఇబ్బంది పడి కన్నీళ్లు వచ్చేశాయని తెలిపారు. తాజాగా ఆలీతో సరదాగా షోలో పాల్గోన్న వైష్ణవ్ పలు ఆసక్తిరకర విషయాలను వెల్లడించాడు.
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చిన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej). ఉప్పెన సినిమాతో హీరోగా సినీరంగ ప్రవేశం చేసి.. సూపర్ హిట్ అందుకున్నాడు. మొదటిసినిమాతోనే తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. ఆ తర్వాత వచ్చిన కొండపొలం సినిమాతో మరోసారి ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం రంగ రంగ వైభవంగా సినిమా చేస్తున్నారు వైష్ణవ్. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సాంగ్స్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. ఈ సినిమాకు గిరీశయ్యా దర్శకత్వం వహిస్తున్నారు. అయితే తాను ఉప్పెన సినిమా షూటింగ్ సెట్ లో ఎమోషనల్ అయ్యాయని.. డైలాగ్ చెప్పడంలో ఇబ్బంది పడి కన్నీళ్లు వచ్చేశాయని తెలిపారు. తాజాగా ఆలీతో సరదాగా షోలో పాల్గోన్న వైష్ణవ్ పలు ఆసక్తిరకర విషయాలను వెల్లడించాడు.
వైష్ణవ్ మాట్లాడుతూ.. ఉప్పెన షూటింగ్ సమయంలో ఓ సన్నివేశంలో కృతిశెట్టితో ఓ డైలాగ్ చెప్పాలి. నీకో మాట చెప్పాలి బేబమ్మ అంటూ కాస్త ఎమోషనల్గా మాట్లాడాలి. ఎందుకో తెలియదు ఆ క్షణం నాకు మాటలు రాలేదు. ఎమోషన్స్ పండించలేకపోయాను. అప్పటికే 20 టేక్స్ తీసుకున్నాను. ఆ సీన్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. అందరి సమయాన్ని, డబ్బును వృథా చేస్తున్నానని బాధ వేసింది. దీంతో ఒక్కసారిగా కన్నీళ్ళు వచ్చేశాయి అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఉప్పెన సినిమాలో వచ్చే రొమాంటిక్ సాంగ్ లో నటించేందుకు తనకు చాలా ఇబ్బందిగా అనిపించిందని. అందరి ముందు ఎలా చేయాలా ? అని అనిపించిందని అన్నారు. అలాగే తనకు కాలేజీ రోజుల్లో సీనియర్స్ అంటే చాలా క్రష్ ఉండేదని.. ఇక పవర్ స్టార్ నటించిన తమ్ముడు, బద్రి సినిమాలను దాదాపు 120 సార్లు చూసినట్లు తెలిపారు.