News

wpl 2023 opening ceremony, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఆరంభోత్సవంలో ఇద్దరు హీరోయిన్స్ డ్యాన్స్.. టోర్నీ డీటైల్స్ ఇవే – kiara advani and kriti sanon among celebrities to perform in wpl 2023 opening ceremony


భారత్ గడ్డపై ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (Women’s Premier League ) (డబ్ల్యూపీఎల్) ఈరోజు నుంచి ప్రారంభంకాబోతోంది. డబ్ల్యూపీఎల్ -2023 (WPL 2023) సీజన్‌లో మొత్తం ఐదు జట్లు పోటీపడబోతుండగా.. 23 రోజుల పాటు జరగనున్న ఈ టోర్నీలో 22 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో నాలుగు డబుల్ హెడర్ మ్యాచ్‌లు. మార్చి 4 నుంచి మార్చి 26 వరకూ జరగనున్న ఈ టోర్నీలోని అన్ని మ్యాచ్‌లూ ముంబయిలోని బ్రబౌర్న్, డీవై పాటిల్ స్టేడియాల్లో జరగనున్నాయి.

ఈరోజు రాత్రి 8 గంటలకి గుజరాత్ టైటాన్స్, ముంబయి ఇండియన్స్ మధ్య డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఫస్ట్ మ్యాచ్ జరగనుంది. వాస్తవానికి ఈ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం రాత్రి 7: 30 గంటలకి ప్రారంభంకావాల్సి ఉంది. కానీ.. డబ్ల్యూపీఎల్ ఆరంభోత్సవం కారణంగా అరగంట లేటుగా స్టార్ట్‌కానుంది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం మ్యాచ్‌లు 3:30 గంటలకి, రాత్రి మ్యాచ్‌లు 7:30 గంటలకి స్టార్ట్ అవుతాయి.

డీవై పాటిల్ స్టేడియంలో ఈరోజు రాత్రి జరగనున్న ఆరంభోత్సానికి బీసీసీఐ పెద్దలతో పాటు బాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే వెలువడిన వార్తల ప్రకారం హీరోయిన్స్ కియారా అద్వానీ (Kiara Advani), కృతి సనన్ (Kriti Sanon) ఈ ఆరంభోత్సవంలో డ్యాన్స్ చేయబోతున్నారు. అలానే సెన్సేషనల్ సింగర్ ఏపీ ఢిలాన్ లైవ్ ఫర్ఫార్మెన్స్ కూడా ఉంది.

Read Latest Sports News, Cricket News, Telugu News

Related Articles

Back to top button