News

WPL 2023: తొలి మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌‌లో మొదటి హాఫ్ సెంచరీ.. | Harman Preet Kaur becomes first player to smack half century in inaugurating season of Women’s Premier League


మహిళల ప్రీమియర్ లీగ్‌ తొలి మ్యాచ్‌లో మొదటిగా బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. అంతేకాక ఆ జట్టు సారథి హర్మన్ ప్రీత్ కౌర్ కూడా డబ్ల్యూపీఎల్..

WPL 2023: తొలి మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌‌లో మొదటి హాఫ్ సెంచరీ..

Harman Preet Kaur Smacks 1st Half Centurty In Wpl

MIW vs GGW 2023: మహిళల ప్రీమియర్ లీగ్‌(డబ్ల్యూపీఎల్) ఆరంగేట్ర సీజన్ తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య కొనసాగుతోంది. అయితే ఈ తొలి మ్యాచ్‌లోనే మొదటిగా బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. అంతేకాక ఆ జట్టు సారథి హర్మన్ ప్రీత్ కౌర్ కూడా డబ్ల్యూపీఎల్ తొలి మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఎన్నటికీ గుర్తుండిపోయేలా.. మొట్టమొదటి హాఫ్ సెంచరీ చేసిన క్రికెటర్‌గా నిలిచింది. టాస్ గెలిచిన గుజరాత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది.

ఈ క్రమంలో ముంబై నాయకురాలు హర్మన్ ప్రీత్ కేవలం 30 బంతుల్లోనే 65 పరుగులు(14 ఫోర్లు) సాధించింది. అమెతో పాటు మ్యాథ్యూస్(47), అమిలియా(45*) కూడా రాణించారు. ఫలితంగా ముంబై జట్టు అదిరిపోయేలా 208 పరుగులు భారీ లక్ష్యాన్ని గుజరాత్ జట్టు ముందు ఉంచింది. ఇక గుజరాత్ బౌలర్లలో స్నేహ్ రాణా రెండు వికెట్లు తీయగా.. ఆష్లే గార్డనర్, తనూజ, జార్జియా తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



Related Articles

Back to top button