WPL 2023: కొత్త జెర్సీని ఆవిష్కరించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. సందడి చేసిన మహిళా క్రికెటర్లు.. ఫొటోలు వైరల్ | WPL 2023: RCB Unveil Their Team Jersey Ahead of Inaugural Season
క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మహిళల ప్రీమియర్ లీగ్ కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మార్చి 4 నుంచి ప్రారంభమయ్యే ఈ సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్రాంచైజీ ఇప్పుడు కొత్త జెర్సీని ఆవిష్కరించింది.
Mar 02, 2023 | 10:04 PM
క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మహిళల ప్రీమియర్ లీగ్ కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మార్చి 4 నుంచి ప్రారంభమయ్యే ఈ సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్రాంచైజీ ఇప్పుడు కొత్త జెర్సీని ఆవిష్కరించింది.
ఇది కూడా పురుషుల జెర్సీ మాదిరిగా మహిళల జెర్సీ కూడా ఎరుపు, నలుపు రంగులలో రూపొందించారు. అయితే స్పాన్సర్ షిప్‌తో పాటు ముందు భాగంలో కొన్ని మార్పులున్నాయి.
ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన, యువ వికెట్ కీపర్ రిచా ఘోష్, బౌలర్ రేణుకా సింగ్, న్యూజిలాండ్ ప్లేయర్ సోఫీ డివైన్ కొత్త జెర్సీ ఫోటో షూట్‌లో కనిపించారు.
మార్చి 4 నుంచి ప్రారంభం కానున్న మహిళల ప్రీమియర్ లీగ్ తొలి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ఇప్పుడు RCB జట్టు తమ తొలి మ్యాచ్‌ని మార్చి 5న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది.