News

world sleep day, Indian Company: హాయిగా నిద్రపోండి.. ఉద్యోగులందరికీ సర్‌ప్రైజ్ గిఫ్ట్.. భారత కంపెనీ కీలక ప్రకటన.. – this indian company announced a surprise holiday for all employees on world sleep day 2023


Indian Company: బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ తమ ఉద్యోగులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. సడెన్‌గా సెలవు ప్రకటించింది. హాయింగా నిద్రపోండి అని చెబుతోంది. గిఫ్ట్ ఆఫ్ స్లీప్‌గా తన లింక్డ్‌ఇన్‌ పోస్ట్‌లో వివరించింది. అయితే ఇది ఆప్షనల్ అని రావాలనుకున్న ఉద్యోగులు మాత్రం ఆఫీసులకు రావొచ్చని చెప్పింది. వారాంతం ఏం కాదు, పండగలేం లేవు.. ఇలా ఎందుకు చేసిందనుకుంటున్నారా? ఇవాళ మార్చి 17. అంతర్జాతీయ నిద్ర దినోత్సవం (World Sleep Day). అందుకే ప్రతిఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, వెల్‌నెస్ పట్ల అవగాహన కలిగించాలనే ఉద్దేశంతోనే ఇలా సెలవు ప్రకటించినట్లు బెంగళూరుకు చెందిన వేక్‌ఫిట్ సొల్యూషన్స్ అనే కంపెనీ వెల్లడించింది. దీంతో ఆ ఉద్యోగులు తమ యాజమాన్యం నిర్ణయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వేక్‌ఫిట్ సొల్యూషన్స్ అనేది డైరెక్ట్ టు కన్జూమర్ (D2C) హోం అండ్ స్లీప్ సొల్యూషన్స్ స్టార్టప్. వరల్డ్ స్లీప్ డే సందర్భంగా అందరికీ సెలవు ప్రకటిస్తున్నట్లు లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేయడం సహా ఉద్యోగులందరికీ ఈ విషయాన్ని ఈ మెయిల్ చేసింది. ‘సర్‌ప్రైజ్ హాలిడే. అనౌన్సింగ్ ది గిఫ్ట్ ఆఫ్ స్లీప్.’ అని ఆ మెయిల్‌లో ఉంది. ఈ వరల్డ్ స్లీప్ డేను ఫెస్టివల్‌గా పాటిస్తున్నట్లు చెప్పుకొచ్చింది వేక్‌ఫిట్ సొల్యూషన్స్.

గతేడాది కూడా ఈ కంపెనీ ఒక కీలక ప్రకటన చేసింది. రైట్ టు నాప్ పాలసీని తీసుకొచ్చింద. దీని కింద కంపెనీ ఉద్యోగులందరినీ పని వేళల్లో 30 నిమిషాలు కునుకు తీసేందుకు అనుమతి ఇచ్చింది. శరీరాన్ని రీఛార్జ్ చేయడంలో, మళ్లీ చేస్తున్న పనిపై దృష్టిని కేంద్రీకరించడంలో మధ్యాహ్నపు నిద్ర ఉపకరిస్తుందని పేర్కొందీ కంపెనీ. హోం ఫర్నీషింగ్ ప్రొడక్ట్స్‌కు సంబంధించి వేక్‌ఫిట్ సొల్యూషన్స్ ప్రసిద్ధి చెందింది. ఇక నిద్రలేమి వల్ల కలిగే రోగాలను దృష్టిలో పెట్టుకొని ఈ కంపెనీ.. వాటిపై జనాలకు, తమ ఉద్యోగులకు అవగాహన కల్పించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.

  • Read Latest Business News and Telugu News

Related Articles

Back to top button