News

Women’s Day: TV9లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు.. మెడికవర్ హాస్పిటల్స్ వైద్యుల ప్రత్యేక సేవలు | Special services of doctors of medicover Hospitals for TV 9 staff


అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని టీవీ 9 ఘనంగా నిర్వహించుకుంది. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు పలు సేవలను అందించారు. మహిళా ఉద్యోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఒకవైపు హోలీ పండుగ.. మరోవైపు మహిళా దినోత్సవం. ఒకే రోజు రెండు పండుగలకు వేదికైన టీవీ9
అటు హోలీ సంబురం.. ఇటు మహిళా దినోత్సవం. నింగిలో హరివిల్లు.. నేలపై ఈ రంగవల్లికలు.. ఆకాశంలో సగం కాదు.. అనంత విశ్వం అతివలదే! జగతికి మూలం.. జగన్మాత స్వరూపం.. పుడమి నుంచి ఆకాశపు అంచులదాకా.. ఆమెది అలుపెరగని పయనం. తాను జాగృతమై తోటివారినీ చైతన్యపరిచినప్పుడే ముందడుగు. ఎదుటి వ్యక్తి హక్కులకు భంగం కలిగించకుండా, తన హక్కుల్ని తాను కోల్పోకుండా మెలిగినప్పుడే పురోగతి. వీటిని సమన్వయం చేసుకోవడంలోనే మహిళాశక్తి దాగుంది. రాజకీయ స్వతంత్రత, ఆర్థిక సమానత, నిస్వార్థ ప్రభుత, ద్వేషరహిత జాతీయత ఉంటేనే దేశం రాణిస్తుంది. అంతేకాదు అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళ జర్నలిజంలోనూ ఉన్నత శిఖరాలను చేరుకుంటున్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని టీవీ 9 ఘనంగా నిర్వహించుకుంది. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు పలు సేవలను అందించారు. మహిళా ఉద్యోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. మహిళలు పలు రంగాల్లో రాణిస్తూ వివిధ ఒత్తిళ్లకు లోనవుతూ అనారోగ్య బారిన పడుతున్నారని.. ఇలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు.

ఇదిలావుంటే, హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళ జర్నలిస్ట్ లను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. టీవీ9 ఛానల్ నుంచి యాంకర్ సంధ్యారాణి, రిపోర్టర్ ప్రణీత, కెమెరామెన్ అమృత మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button