News

Women’s Day 2023: మహిళలకు గుడ్‌న్యూస్‌.. నేడు అన్ని సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం | International Women’s Day 2023: Free Bus Rides For women in Bengaluru on Women’s Day


అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా బుధవారం (మార్చి 8) ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు..

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా బుధవారం (మార్చి 8) ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు బెంగళూరు మెట్రోపొలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (BMTC) ప్రకటించింది. అంటే మహిళా దినోత్సవమైన బుధవారం రోజు బెంగళూరులో మహిళలు ఏసీ సర్వీసెస్‌ (KIA) బస్సులతోపాటు అన్నిరకాల బస్సుల్లో టికెట్‌ లేకుండా ఉచితంగా ప్రయాణించవచ్చన్నమాట. మహిళలకు సురక్షితమైన ప్రజా రవాణా వ్యవస్థను అందించడం, ఇతర రవాణా మార్గాల నుంచి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌కు మారేలా మహిళలను ప్రోత్సహించడం ద్వారా సిటీ బస్సుల రైడర్‌షిప్‌ను పెంచాలనే లక్ష్యంతో బీఎమ్‌టీసీ మంగళవారం (మార్చి 7) ఈ మేరకు ప్రకటించింది. మహిళలు ప్రైవేటు ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ వాడే బదులు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు సర్వీసు వాడాల్సిందిగా బీఎంటీసీ కోరింది. ఫలితంగా ట్రాఫిక్ తగ్గి నగరంలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ మెరుగవుతుందని పేర్కొంది.

కాగా బెంగళూరు నగరంలో మహిళలకు ఉచిత బస్‌ ప్రయాణ సౌకర్యాలు అందించడం ఇదే మొదటి సారికావడం విశేషం. బీఎమ్‌టీసీ ఏర్పడి 25 ఏళ్లు నిండిన సందర్భంగా గతేడాది ఆగస్టు 15న బెంగళూరు నగరవాసులందరికీ ఉచిత బస్‌ ప్రయాణాలు కల్పించింది. కాగా బెంగళూరు నగరంలో 6,600ల సిటీ బస్సులు నిత్యం 29 లక్షల ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. వీరిలో 25 నుంచి 30 శాతం మంది మహిళలు ఉన్నారు. దాదాపు 20 లక్షల మంది మహిళలు మార్చి 8న సిటీ బస్సులో ఉచితంగా ప్రయాణించనున్నారు. ఇందుకుగానూ బీఎమ్‌టీసీకి ఛార్జీల ద్వారా వచ్చే రూ.8 కోట్ల ఆదాయాన్ని వదులుకుంటుంది.

ఇవి కూడా చదవండి



మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button