News

Woman Shaving,మరో వింత.. సెలూన్‌లో యువతికి షేవింగ్.. బ్రహ్మంగారు చెప్పిందే జరిగిందిగా! – video of a woman getting her face shaved in a salon goes viral


భవిష్యత్‌లో ఏం జరగబోతోంది అనే విషయాలను ఎప్పుడో బ్రహ్మంగారు చెప్పారు. అయితే బ్రహ్మంగారు కాలజ్ఞానం రాస్తూ చెప్పిన విషయాలు అప్పుడు విన్నవారికి చాలా వింతలుగా, నమ్మశక్యం కానివిగా అనిపించాయి. నిజానికి అవి ఒక్కొక్కటిగా జరుగుతూ వార్తలు బయటికి వస్తున్నాయి. అవి చూసిన మనం కూడా వాటిని నమ్మలేకపోతున్నాం. ఇప్పటివరకు బ్రహ్మంగారు చెప్పినవి ఎన్నో మన సమాజంలో జరుగుతూనే ఉన్నాయి. అలాంటి సంఘటనే తాజాగా ఒకటి జరిగింది. ఓ యువతి సెలూన్‌కు వెళ్లి.. షేవింగ్ చేయించుకుంది. అయితే ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు కామెంట్ల రూపంలో స్పందిస్తున్నారు.

అయితే ఈ ఘటన ఎక్కడ జరిగింది అన్నదానిపై ఎలాంటి స్పష్టత రాలేదు. ఓ మహిళ.. సెలూన్‌కు వెళ్లి అక్కడ షేవింగ్ చేయించుకున్నట్లు ఉన్న వీడియో తెగ వైరల్ అవుతోంది. అయితే సాధారణంగా పురుషులు సెలూన్‌కు వెళ్లి షేవింగ్ చేసుకోవడం సాధారణం కాగా.. ఒక మహిళ ఇలా చేసుకోవడం చూసిన వారని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని సెలూన్‌కు వెళ్లిన ఆ యువతి.. షేవింగ్ చేయించుకుంది. యువతికి షేవింగ్ క్రీమ్ రాసి.. ఆ సెలూన్‌లో ఉన్న వ్యక్తి షేవింగ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను అక్కడ ఉన్నవారు తీశారు. 15 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉంచడంతో వైరల్‌గా మారింది.

అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్‌కు గురై.. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి.. మార్పు అనేది ప్రకృతి ధర్మం అని క్యాప్షన్ పెట్టడం గమనార్హం. గతంలో కూడా ఇలాంటి ఒక వీడియో టిక్‌టాక్‌లో వైరల్‌ అయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఓ మహిళ తన ముఖాన్ని ఎప్పటికప్పుడు షేవ్ చేసుకుంటున్నట్లు గతంలో ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. అలా ముఖానికి షేవింగ్ చేసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుందని.. పైగా చ‌ర్మంపై ఉండే మృత‌క‌ణాలు, నూనెలను తొలగిస్తుందని పేర్కొంది. ఇలా చేయడం వల్ల మేకప్ మరింత సులభంగా వేసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పడం విశేషం. షేవింగ్ చేసుకోవడం వల్ల చర్మానికి ఎలాంటి హాని జరగదని తెలిపింది.

అయితే గతంలో బ్రహ్మంగారు కాలజ్ఞానం రాస్తూ.. భవిష్యత్‌లో జరిగే వింతలను ముందే చెప్పేశారు. పొట్టివాడు దేశాన్ని ఏల‌ుతాడని.. పంది కడుపున కోతి పుడుతుందని.. రెక్కలు వచ్చిన కోడి పిల్ల మనిషి భాషలో మాట్లాడుతుందంటూ చెప్పారు. అయితే అప్పుడు అవన్నీ వింత వింతగా అనిపించగా.. ప్రస్తుతం మాత్రం ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఇటీవల ఆదిలాబాద్‌లో కూడా ఇలా బ్రహ్మంగారు చెప్పినట్లే ఓ ఘటన జరిగింది. నంది విగ్రహం పాలు తాగుతున్నట్లు వార్తలు రావడం తీవ్ర చర్చలకు దారి తీసింది.

Lamborghini: చిరకాల కోరికను రిటైర్మెంట్ తర్వాత నెరవేర్చుకున్న వృద్ధుడు

WWE Fighting: ఆడ, మగ డిష్యుం డిష్యుం.. నది ఒడ్డున WWE రేంజ్‌ ఫైటింగ్
Read More Latest Inter National News And Telugu News

Related Articles

Back to top button