Entertainment

Ram Charan: బాలీవుడ్‌లో సినిమా చేయడానికి రెడీ అయిన మెగా పవర్ స్టార్.?


నిజంగానే ముంబై కా రాజా కావాలని చూస్తున్నారు రామ్ చరణ్. దానికి తగ్గట్లుగానే పావులు కదుపుతున్నారు కూడా. అప్పుడెప్పుడో పదేళ్ళ కిందే జంజీర్ సినిమాతో నార్త్‌కు వెళ్లారు చరణ్.

పదేళ్ళ తర్వాత రామ్ చరణ్ రెండో బాలీవుడ్ సినిమా చేస్తున్నారా..? జంజీర్ తర్వాత హిందీ ఇండస్ట్రీ వైపు అడుగులు వేయని మెగా వారసుడు.. తాజాగా తన స్నేహితుడి కోసం నార్త్‌కు వెళ్తున్నారా..? ఓ వైపు ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంటూనే.. మరోవైపు బాలీవుడ్‌పై ఫోకస్ చేసారా..? అసలు చరణ్ నటిస్తున్న రెండో హిందీ సినిమా ఏంటి..?

నిజంగానే ముంబై కా రాజా కావాలని చూస్తున్నారు రామ్ చరణ్. దానికి తగ్గట్లుగానే పావులు కదుపుతున్నారు కూడా. అప్పుడెప్పుడో పదేళ్ళ కిందే జంజీర్ సినిమాతో నార్త్‌కు వెళ్లారు చరణ్. కానీ తొలి అడుగు ఫెయిలైంది. తర్వాత ఎప్పుడూ బాలీవుడ్ వైపు చూడని చరణ్.. ట్రిపుల్ ఆర్‌తో అక్కడ మార్కెట్ తెచ్చుకున్నారు.

ఇన్నేళ్ళ తర్వాత మరోసారి బాలీవుడ్‌పై ఫోకస్ చేసారు రామ్ చరణ్. కథ నచ్చితే అక్కడ నటించడానికి ఎలాంటి సమస్య లేదని చెప్పిన మెగా హీరో.. తన స్నేహితుడు సల్మాన్ ఖాన్ సినిమాలో కనిపిస్తున్నారు. ఈయన హీరోగా వస్తున్న కిసి కా భాయ్.. కిసీ కా జాన్ సినిమాలో రామ్ చరణ్ ఓ పాటలో మెరుస్తున్నారు. జానీ కొరియోగ్రఫీలో ఈ పాట వస్తుంది.

ఇప్పటికే కిసి కాభాయ్ కిసి కా జాన్ అంతా సౌత్ యాక్టర్స్‌తో నిండిపోయింది. ఇందులో వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తుండగా.. పూజా హెగ్డే హీరోయిన్. జగపతిబాబు విలన్‌గా నటిస్తున్నారు. తాజాగా రామ్‌చరణ్ గెస్ట్ అప్పియరెన్స్ తెలుగులో మరింత హెల్ప్ కానుంది. మొత్తానికి దశాబ్ధం తర్వాత మళ్లీ హిందీలో నటిస్తున్నారు రామ్ చరణ్.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button