Entertainment

Ravi Teja: మాస్ రాజా బౌన్స్‌బ్యాక్ అయ్యేనా..? రవితేజ ఆశలన్నీ ఆ సినిమా పైనే


మాస్ మహారాజ రవితేజ ఒక్క సినిమా హిట్ పడితే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లు పలకరిస్తున్నాయి.  అప్పుడెప్పుడో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా తర్వాత మొన్నామధ్య క్రాక్ సినిమాతో హిట్ అందుకున్నాడు.

మాస్ మహారాజ రవితేజ(Ravi Teja) ఒక్క సినిమా హిట్ పడితే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లు పలకరిస్తున్నాయి. అప్పుడెప్పుడో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా తర్వాత మొన్నామధ్య క్రాక్ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత షరామామూలే.. రీసెంట్ గా వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. అయినా మాస్ రాజా మాత్రం తగ్గడం లేదు. వరుస సినిమాలను లైనప్ చేసి రెట్టింపు ఉత్సహాం తో షూటింగ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ధమాకా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు రవితేజ. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో క్రేజీ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. ‘ధమాకా’ మేకర్స్ చార్ట్‌బస్టర్‌ ‘జింతాక్‌’ సాంగ్ తో గ్రాండ్ మ్యూజిక్ ప్రమోషన్‌లను ప్రారంభించారు. ఇప్పుడు సెకండ్ సింగిల్ మాస్ రాజా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.

ఈ పాట సినిమా ఇంట్రడక్షన్ సాంగ్ అని టైటిల్ సూచిస్తోంది. మాస్ రాజా సాంగ్‌లో మాస్ మహారాజా మాస్ డ్యాన్స్‌లను చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాంగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్‌లో రవితేజ ఊర మాస్‌గా కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నాడు మాస్ రాజా.. గతంలో త్రినాథరావు నక్కిన  దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా కూడా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి మాస్ రాజాకు ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ తెచ్చిపెడుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button