SSMB 28: పూనకాలు లోడింగ్.. త్రివిక్రమ్ సినిమాలో మహేష్ బాబు ఆ పాత్రలో కనిపించనున్నాడా.. ?
మహేష్ కెరీర్ లో 28వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా లేటెస్ట్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల నటిస్తుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం ఆయన అభిమానులు వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు రీసెంట్ గా సర్కారు వారి పాట సినిమాతో మంచి హిట్ అందుకుంది. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. దాదాపు 12 ఏళ్ల తరవాత అంటే ఖలేజా సినిమాతర్వాత మహేష్ చేస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ కెరీర్ లో 28వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా లేటెస్ట్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ నుంచి లీక్ అయిన ఫోటోలు తెగ వైరల్ అవుతుంటాయి.
ఈ సినిమాలో మహేష్ చాలా డిఫరెంట్ గా కనిపించనున్నారట. ఈ సినిమాలో మహేష్ రోల్ చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. కెరీర్ బెస్ట్ లుక్ లో ఈ సినిమాలో మహేష్ బాబు కనిపించబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది. పాత్రకు తగ్గట్లుగా మహేష్ బాబును చాలా క్యాజువల్ దుస్తులతో పాటు విభిన్నమైన హెయిర్ స్టైల్ లో కనిపించనున్నారట.
మహేష్ ఈ సినిమాలో సూపర్ కాప్ రోల్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. గతంలో పలు సినిమాలలో సూపర్ కాప్ రోల్స్ లో నటించి సూపర్ హిట్స్ అందుకున్నారు మహేష్. ఇక ఈ సినిమాలో అదిరిపోయే పోలీస్ గెటప్ లో కనిపించనున్నారని టాక్. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.