Entertainment

Mahesh Babu, SS Rajamouli: మహేష్ బాబు- రాజమౌళి సినిమాలో హాలీవుడ్ నటులు.?


Mahesh Babu, Rajamouli

మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ మూవీ కోసం సూపర్ స్టార్ అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్ లో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మరో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తోంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళి మూవీ షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నారు. ఈ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా జక్కన్న ఈ సినిమాను ప్లాన్ చేశారని సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమానుంచి క్రేజీ అప్డేట్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో వైరల్ అవుతోంది.

మహేష్ బాబు తో జక్కన్న రూపొందించబోతున్న సినిమా ను హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు నిర్మించేందుకు ముందుకు వస్తున్నాయని తెలుస్తోంది. సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్లు పని చేయనున్నారట. మన దేశ ప్రధాన భాషలలో ఈ సినిమా తెరకెక్కుతోందని టాక్.

ఈ మూవీలోని కొన్ని సీన్స్ ను చాలా ప్రత్యేకంగా ఉండేలా తెరకెక్కించనున్నారట. ఆ సీన్స్ ను ఇంగ్లీష్ లో చిత్రీకరణ చేయాలని కూడా జక్కన్న భావిస్తున్నాడట. హాలీవుడ్ టెక్నీషియన్స్ తో పాటు ఇంగ్లీష్ నటీ నటులు కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నారని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

 

Related Articles

Back to top button