Jr.NTR: వార్2లో తారక్ పక్కన జోడీ ఎవరు.? ఇప్పుడు ఇదే ఎన్టీఆర్ ఫ్యాన్స్ టార్గెట్..
కెరీర్ అద్భుతమైన ఊపుమీద ఉన్నప్పుడు, ప్రతి అడుగూ జాగ్రత్తగా ఆచితూచి వేయాలి. అప్పుడే నెక్స్ట్ ఫేజ్ ఇంకా వండర్‌ఫుల్‌గా ఉంటుంది. ఏమాత్రం తడబడినా, డ్యామేజ్ మామూలుగా ఉండదు. ఇప్పుడు ఎన్టీఆర్ విషయంలోనూ ఇలాంటి విషయాలనే డిస్కస్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్.
ఇంత సీరియస్ డిస్కషన్ ఇప్పుడు ఎందుకు మొదలైంది.? ట్రిపుల్ ఆర్‌లో కొమరం భీమ్‌గా తారక్ నటనకు ఫిదా అయిపోయారు నార్త్ ఆడియన్స్. ఆయన వేసే స్టెప్పులకు, స్క్రీన్ మీద చూపించిన ఎమోషన్స్ కీ, చలాకీ తనానికి ఫ్యాన్స్ అయిపోయారు.
హృతిక్ రోషన్ వార్2 కోసం అయాన్ ముఖర్జీ అప్రోచ్ అయ్యారంటేనే ఫిల్మ్ మేకర్స్ లోనూ తారక్ మీద ఏ రేంజ్ నమ్మకం కుదిరిందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న తారక్ నెక్స్ట్ వార్2 షూటింగ్లో జాయిన్ అవుతారు.
మూడు నెలల పాటు వార్2కి కాల్షీట్ కేటాయించారట తారక్. వార్2లో యంగ్ టైగర్ నెగటివ్ రోల్ పోషిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ మూవీలో కియారా హీరోయిన్ అని గతంలో వార్తలు వచ్చినప్పుడు, తారక్ పక్కనేనని ఫిక్సయిపోయారు మనవారు.
కానీ లేటెస్ట్ గా వినిపిస్తున్న న్యూస్ ప్రకారం తారక్‌తో జోడీ కట్టే ఛాన్స్ కొట్టేసిన భామ పేరు శార్వరి వాఘ్. బంటీ ఔర్ బబ్లీ సీక్వెల్లో మెప్పించిన బ్యూటీ శార్వరి. సౌత్‌లో ఈమెకు ఇదే ఫస్ట్ మూవీ. తారక్ పక్కన అవకాశం ఆమెకు లక్కీ ఛాన్సే.
కానీ, మా హీరో పక్కన మాంఛి ఫేమ్‌లో ఉన్న హీరోయిన్ చేస్తే బావుంటుందన్నది ఫ్యాన్స్ మాట. ఉత్తరాది నుంచి మేకర్స్ వచ్చారని వెంటనే కాల్షీట్ ఇచ్చిన ప్రభాస్‌కి ఆదిపురుష్ నిరాశ మిగిల్చింది. పక్కవారికి కలిగిన ఇలాంటి అనుభవాలను దృష్టిలో ఉంచుకుని తారక్ ఫస్ట్ నుంచి ప్రతి విషయంలోనూ అలర్ట్ గా ఉండాలన్నది ఫ్యాన్స్ నుంచి అందుతున్న సలహా.