News

Watch Video: బంటి.. నీ అంపైరింగ్ స్లో నా ఏంటీ.. స్టీవ్‌ బక్నర్ వర్షన్ 2.0 అంటూ నెటిజన్ల ట్రోలింగ్‌.. వీడియో చూస్తే నవ్వులే.. | A hilarious incident in a village league match umpire trolls on social media video goes viral


ఈ వీడియోలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ చాలా ఉత్కంఠగా జరుగుతోంది. అయితే, బౌలర్‌ బంతిని విసరగానే.. క్రీజులో ఉన్న బ్యాటర్‌ షాట్ ఆడేందుకు విఫలయత్నం చేశాడు. కానీ, బంతి గాల్లోకి లేవడంతో, కీపర్ క్యాచ్ పట్టాడు.

Watch Video: బంటి.. నీ అంపైరింగ్ స్లో నా ఏంటీ.. స్టీవ్‌ బక్నర్ వర్షన్ 2.0 అంటూ నెటిజన్ల ట్రోలింగ్‌.. వీడియో చూస్తే నవ్వులే..

Umpire Trolls Viral Video

ప్రస్తుతం టీ20 లీగ్‌ల సందడితో అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. ఇందులో ఎన్నో ఫన్నీ వీడియోలు వైరలవుతుంటాయి. ఇలాంటి వాటిలో విలేజ్ క్రికెట్‌ వీడియోలు కూడా చోటు దక్కించుకుంటున్నాయి. విలేజ్ క్రికెట్ వీడియోలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. వీటిలో కొన్ని వీడియోలు చూస్తే మాత్రం చాలా ఫన్నీగా అనిపిస్తుంటాయి. కడుపుబ్బా నవ్వేలే చేస్తుంటాయి. ఇక అంపైర్లు చేసే వన్యాసాల గురించి చెప్పాల్సిన పనిలేదు. అలాంటి వాటిలో తాజాగా వచ్చిన ఓ వీడియో కూడా చేరింది. ఇందులో ఓ అంపైర్ వెలువరించే నిర్ణయంతో నెటిజన్లకు ఫుల్ ఫన్ దొరికింది. అయితే, ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందనేది మాత్రం తెలియరాలేదు.

ఈ వీడియోలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ చాలా ఉత్కంఠగా జరుగుతోంది. అయితే, బౌలర్‌ బంతిని విసరగానే.. క్రీజులో ఉన్న బ్యాటర్‌ షాట్ ఆడేందుకు విఫలయత్నం చేశాడు. కానీ, బంతి గాల్లోకి లేవడంతో, కీపర్ క్యాచ్ పట్టాడు. ఈ క్రమంలో బౌలర్‌తోపాటు కీపర్‌ కూడా అప్పీలు చేశారు. అంపైర్‌ ఏమాత్రం స్పందించకుండా.. అలాగే ఉండిపోయాడు. అప్పీల్ చేసి, చేసి విసిగిపోయారు. దీంతో మరలా బౌలింగ్‌ వేసేందుకు బౌలర్ రెడీ అయింది. ఈ క్రమంలో అంపైర్‌ ఔట్ అంటూ చేతిని పైకి ఎత్తేశాడు. ఆశ్చర్యపోవడం బ్యాటర్‌ వతైంది. ఇదేం అంపైరింగ్ రా బాబూ అంటూ ఆగ్రహం వ్యక్తం చూస్తూ.. పెవిలియన్ చేరింది. ఈ నిర్ణయంపై నెటిజన్లు విపరీతంగా ట్రోలింగ్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి



మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



Related Articles

Back to top button