News

Watch Video: అభిమానులంటే మీరే.. పొగడ్తల వర్షం కురిపిస్తోన్న నెటిజన్లు.. వీడియో చూస్తే మీరు కూడా ఫిదా అవ్వాల్సిందే.. | Japan fans clean stadium after win on germany fifa world cup 2022 watch video


FIFA World Cup 2022: ఫిఫా వరల్డ్ కప్ 2022 గ్రూప్ E మ్యాచ్‌లో జపాన్ టీం జర్మనీని ఓడించింది. ఈ మ్యాచ్ తర్వాత జపాన్ అభిమానులు అందరికీ ఆదర్శంగా నిలిచారు.

Watch Video: అభిమానులంటే మీరే.. పొగడ్తల వర్షం కురిపిస్తోన్న నెటిజన్లు.. వీడియో చూస్తే మీరు కూడా ఫిదా అవ్వాల్సిందే..

Fifa World Cup 2022 Japan Fans

ఫిఫా ప్రపంచ కప్ 2022 గ్రూప్ ఈ మ్యాచ్‌లో జపాన్ టీం జర్మనీని ఓడించింది. ఈ మ్యాచ్ తర్వాత, జపాన్ అభిమానులు అందరికీ ఆదర్శంగా నిలిచారు. మ్యాచ్ ముగిసిన తర్వాత జపాన్ ఫుట్‌బాల్ జట్టు అభిమానులు స్టేడియంను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా చెత్తను ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల్లో నింపారు. దీనికి సంబంధించిన వీడియోను ఫిఫా తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసి అభిమానులను ప్రశంసించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతోంది. ఎంతోమంది లైక్ చేస్తున్నారు. అలాగే తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

జపాన్, జర్మనీ మధ్య జరిగిన మ్యాచ్‌లో భారీ ఉత్కంఠ నెలకొంది. ప్రపంచకప్‌లో పోటీపడే జట్టు జర్మనీపై జపాన్‌ 2-1తో విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు గెలుపు కోసం అన్ని విధాలా ప్రయత్నించారు. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో కనిపించిన దృశ్యాన్ని అందరూ కొనియాడుతున్నారు. చారిత్రాత్మక విజయం తర్వాత జపాన్ అభిమానులు స్టేడియంను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల్లో వాటర్ బాటిళ్లు, ఇతర చెత్తను సేకరించారు. దీని వీడియోను ఫిఫా షేర్ చేసింది.

ఫిఫా తన అధికారిక హ్యాండిల్‌లో జపాన్ అభిమానుల వీడియోను పంచుకుంది. వారిని ప్రశంసించింది. ఈ ఫిఫా వీడియోను ట్విట్టర్‌లో 82 వేల మందికి పైగా లైక్ చేయగా, 16 వేల మందికి పైగా రీట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై ట్విట్టర్ వినియోగదారులు జపాన్ అభిమానులను ప్రశంసించారు.

ఇవి కూడా చదవండి



మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



Related Articles

Back to top button