Watch! బంతిలో తల చిక్కుకున్న ఎలుక.. ఎటు వెళ్లాలో తెలియక నానా తిప్పలు.. – Telugu News | Watch viral video of a rat running on roads with its head stuck in a pink ball
ఇప్పటి వరకూ చిన్న పిల్లలు ఆడుతూ బిందెల్లో తలలు పెట్టిన సంఘటల గురించి తెలుసు. అంతేకాదు అప్పుడప్పుడు కుక్కలు కూడా బిందెల్లో ఏమైనా తినడానికి దొరుకుంటాయేమో అని ఆశతో తల పెట్టి.. తర్వాత ఆ బిందెనుంచి తల బయటకు రాక నానా తిప్పలు పడుతున్న వీడియోలు నెట్టింట్లో అప్పుడప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఇప్పడు ఎలుక తన వంతు వచ్చింది అన్నట్లు ఓ బంతిలో తల పెట్టింది. తర్వాత అందునుంచి తల బయటకు తీసుకోవడం తెలియక నానా తిప్పలు పడింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు పలువురిని ఆకర్షిస్తోంది. ఈ ఘటన తెలంగాణాలోని సిరిసిల్ల లో చోటు చేసుకుంది.
సిరిసిల్ల పట్టణం విద్యా నగర్ లో పింక్ కలర్ బంతిలో తల చిక్కుకుపోవడంతో రోడ్లపై పరిగెడుతున్న ఎలుక స్థానికులకు కంట పడింది. దీంతో అక్కడ ఉన్నవాళ్ళు వెంటనే తమ సెల్ ఫోన్లకు పని చెప్పి.. చకచకా వీడియో తీసారు. తర్వాత ఆ వీడియోలు ఎలుక పడుతున్న తిప్పలు చూపించే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తో ప్రస్తుతం వైరల్ మారింది. పాపం ఎలుక తల బంతిలో చిక్కుకుపోవడంతో ఎటు వెళ్ళాలో తెలియక రోడ్డు పై, ముళ్ళ పొదల్లో ఆటు, ఇటు పరిగెడుతూ నాన తంటాలు పడింది. స్థానికులు రంగంలోకి దిగి అటుఇటు తిరుగుతూ గంతులేస్తున్న ఎలుకను పట్టుకుని ఎలుక తలను బంతి నుండి విడదీసి ఎలుకకు విముక్తి కలిగించారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..