News

Watch: అరే భాయ్‌..! అది కొరడా కాదు.. కొండచిలువ..!! ఆ మనిషిని అలా కొట్టేస్తున్నావ్‌.. – Telugu News | Watch video: Man uses pet python during street fight in Canada Telugu News


పాము భయంతో అవతలి వ్యక్తి కూడా కిందపడుతూ లేస్తూ పరిగెడుతున్నాడు.. అయినప్పటి అతడు మాత్రం పామును బెల్ట్‌లా తిప్పుతూ, ఊపుతూ దాడి చేస్తున్నాడు. ఈ వింత సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.

పిచ్చి పిచ్చి పనులు చేసే కొందరు వ్యక్తులకు సంబంధించిన వీడియోలు అనేకం ఇంటర్నెట్‌లో ఎప్పుడూ సందడి చేస్తుంటాయి. అలాంటి వీడియో ఒకటి ట్విట్టర్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే, సాధారణంగా గొడవలు, పంచాయితీలు, కోట్లాటలకు సంబంధించిన అనేక ఘటనలు చూశాం. అలాంటి సందర్భాల్లో ప్రజలు కోపంతో కోట్టుకోవటం కూడా చూస్తుంటాం. ఈ క్రమంలోనే కర్రలు, కత్తులు, గన్స్‌, రాడ్లు, బెల్ట్‌లతో కూడా కొట్టుకోవటం చూస్తుంటాం. కానీ, ఇక్కడ మాత్రం ఓ వ్యక్తి తనకు కోపం ఉన్న వ్యక్తిపై నడిరోడ్డుమీదే దాడి చేశాడు. కానీ, అతడు ఉపయోగించిన ఆయుధం తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే..! ఎందుకంటే, అతను తన శత్రువును కొట్టడానికి తన పెంపుడు పామును ఆయుధంగా వాడుకున్నాడు.. అవునా..? నిజమా.? అనే సందేహం కలుగుతుంది కదా..! కానీ, ఇదంతా నిజమేనండోయ్‌..మీరు సరిగ్గానే వింటున్నారు. కెనడాలోని టొరంటోలో జరిగింది ఈ ఘటన. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కెనడాలోని టొరంటోలో ఒక వ్యక్తి కొండచిలువను ఆయుధంగా ఉపయోగించి అవతలి వ్యక్తిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన గత బుధవారం రాత్రి 11:50 గంటలకు (Dundas Street )డుండాస్ స్ట్రీట్ వెస్ట్‌లో జరిగింది. వీడియోలో, ఒక వ్యక్తి తన పెంపుడు కొండచిలువను చేతిలో పట్టుకుని గాల్లో తిప్పుతూ..రోడ్డు మధ్యలో నిలబడి ఒక వ్యక్తిపై దాడి చేస్తున్నాడు. పాము భయంతో అవతలి వ్యక్తి కూడా కిందపడుతూ లేస్తూ పరిగెడుతున్నాడు.. అయినప్పటి అతడు మాత్రం పామును బెల్ట్‌లా తిప్పుతూ, ఊపుతూ దాడి చేస్తున్నాడు. ఈ వింత సంఘటన బుధవారం రాత్రి 11:50 గంటలకు డుండాస్ స్ట్రీట్ వెస్ట్, మన్నింగ్ అవెన్యూ ప్రాంతంలో జరిగింది. ఇదంతా వీడియో తీసిన కొందరు స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయటంతో వైరల్‌గా మారింది.

ఇక,ఘటనకు సంబంధించిన సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. లారేనియో అవిలాను పోలీసులు అరెస్టు చేశారు. ఎదుటి వ్యక్తిపై దాడి కేసుతో పాటుగా పామును ఆయుధంగా ఉపయోగించి మూగజీవిని హించింనట్టుగా అభియోగాలు మోపారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement



Related Articles

Back to top button