Washington Sundar, Anchor Varshini: ఫొటోలు పెట్టిన యాంకర్ వర్షిణి.. వాషింగ్టన్ సుందర్ ఎఫైర్ ఎఫెక్ట్‌తో పచ్చి బూతులు – anchor varshini sounderajan and washington sundar love affair its true here is cricket fans reactions
మొత్తానికి యాంకర్ వర్షిణితో వాషింగ్టన్ సుందర్ లవ్వాయణం అయితే హాట్ టాపిక్ అయిపోయింది. నిజంగానే వీళ్ల మధ్య ఎఫైర్ నడుస్తుందా? అసలు యాంకర్ వర్షిణికి అంత సీన్ ఉందా? స్టార్ బ్యాట్స్‌మెన్ ఈ యాంకర్‌కి పడిపోవడం నిజమేనా? అన్నదానిపై డౌటానుమానాలు చాలానే ఉన్నాయి.
అయితే నెటిజన్లు మాత్రం.. యాంకర్ వర్షిణిని ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. ఈమె మ్యాచ్ చూడ్డానికి వెళ్లిన ప్రతిసారి సన్ రైజర్స్ ఓడిపోవడంతో.. ఆ టీం సెమీస్‌కి క్వాలిఫై కాకపోవడానికి ఈమే కారణం అంటూ నిందిస్తున్నారు. ఇదెక్కడి కర్మరా సామీ.. వర్షిణి వెళ్తే మ్యాచ్ ఓడిపోతారా? మీరు భలేగున్నారు బాస్.. వాళ్లు సరిగా ఆడలేదు.. ఓడిపోయారు.. దానికి వర్షిణిని నిందించడం కరెక్ట్ కాదు బాస్ అనేవాళ్లూ ఉన్నారు. ఇక వాషింగ్టన్ సుందర్‌ని టీం నుంచి తప్పించడం వెనుక కూడా యాంకర్ వర్షిణితో ఎఫైర్ కారణం అనే వాళ్లు ఉన్నారు. దీంతో ఆమెను తిట్టిపోస్తున్నారు.
తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీకెండ్ ఎలా సాగుతుందో అంటూ ఫొటోలు పెట్టింది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో రియాక్ట్ అవుతున్నారు. ‘బహుత్ సుందర్.. బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు ఉన్నావ్’.. ‘మంచి బ్యాట్స్‌మెన్‌ని పట్టేశావ్’.. ‘మన సుందర్ ఎలా ఉన్నాడు’.. ‘వాషింగ్టన్ సుందర్‌తో డేటింగ్ అంట కదా.. బయట టాకూ’.. అంటూ డబుల్ మీనింగ్‌లో బూతు కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. అయితే ఈ ఎఫైర్‌పై అటు వాషింగ్టన్ సుందర్ కానీ.. ఇటు వర్షిణి కానీ రియాక్ట్ కాలేదు. అసలు ఈ విషయం సుందర్‌కి తెలిసి ఉంటుందా? తెలిస్తే మాత్రం.. నేనేంటి? ఆ యాంకర్‌తో డేటింగ్ ఏంటి? అని నవ్వుకోవడం ఖాయమేనేమో.