waltair veerayya trailer, చిరు ‘మాఫియా’ టచ్.. బాలయ్య ‘ఫ్యాక్షన్’ పంచ్.. సంక్రాంతి ‘మాస్’ రికార్డులు ఎవరివో..? – who will be the winner in sankranthi festival fight chiranjeevi waltair veerayya or balakrishna veera simha reddy
అయితే.. ఇక్కడ ఇద్దరు హీరోలు మాస్ అస్త్రాన్నే ఈసారి గట్టిగా నమ్ముకున్నట్టు తెలుస్తోంది. అటు గోపిచంద్ మలినేని, ఇటు బాబీ.. పాత స్టోరీ లైన్‌కే.. కథకు కొత్త రంగులద్ది ప్రేక్షకుల మీదికి కొంచెం మసాలా దట్టించి వదులుతున్నట్టు అర్థమవుతోంది. వీరసింహారెడ్డికి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తుండగా.. థమన్ మ్యూజిక్, సాయిమాధవ్ బుర్రా డైలాగులు అందించారు. కాగా.. వాల్తేరు వీరయ్యకు బాబీ డైరెక్షన్ చేయగా డీఎస్పీ మ్యూజిక్ అందించారు. వీరసింహారెడ్డితో బాలయ్య బాబు.. మళ్లీ భారీ భారీ పౌరుషమైన డైలాగులు, గొడ్డళ్లతో ఊచకోత.. డబుల్ యాక్షన్, అచ్చొచ్చిన సీమ ఫ్యాక్షన్.. ఇలా చాలా సెంటిమెంట్లు రిపీట్ చేశారు. మరోవైపు చిరు కూడా మాస్ పాత్రతో పాటు.. తనదైన కామెడీ, డ్యాన్సులు, తమ మార్క్ డైలాగులు, ఇంటర్నేషనల్ మాఫియాను టచ్ ఇస్తూ ట్రీట్ ఇచ్చేందుకు వస్తున్నాడు. అయితే.. ఇందులో రవితేజ కీలక పాత్ర పోషిస్తుండటం మరో ఎత్తు. ఇద్దరు కలిసి 20 ఏళ్ల క్రితం నటించగా.. ఇప్పుడు మళ్లీ అదే కాంబో రిపీటవుతుంటడంతో.. మాస్‌కి డబుల్ ధమాకానే. మరోవైపు.. రెండు సినిమాల్లోనూ లక్కీ హీరోయిన్ శ్రుతిహాసన్ ఉడటం కొసమెరుపు.
అయితే ప్రయోగాలకు పోతే.. సీన్ రివర్స్ అవుతోందని తెలుసుకున్నారో లేదా సంక్రాంతికి ప్రేక్షకులకు మంచి విందు భోజనం పెట్టాలని నిర్ణయించుకున్నారో తెలియదు గానీ.. పాత అస్త్రమైనా పండక్కి మాస్ స్టోరీలతో దిగుతూ గట్టిగానే ప్లాన్ చేశారు ఇద్దరు హీరోలు. అయితే.. ఈ రెండు సినిమాలకు ఒకే ప్రొడక్షన్ కావటం గమనార్హం. రెండు ఒకే సారి వస్తుండటంతో.. ప్రేక్షకుడు ఏ ధియేటర్‌కు వెళ్లినా.. డబ్బులు వచ్చేది మాత్రం చివరికి వాళ్లకే కదా. కాకపోతే.. రికార్డులు మాత్రం హీరోల అకౌంట్లోకి పోతాయి. ఇప్పుడు ఆ రికార్డుల గురించే రచ్చంతా. రిలీదైన రెండు ట్రైలర్లలో మాస్ కా బాప్, గాడ్ ఆఫ్ మాసెస్, మాస్ మహారాజా, అంటూ టైటిల్ కార్డులతో పాటు ప్రత్యేకంగా “మాస్” డైలాగులు కూడా చెప్పటం గమనార్హం. మరి.. పండక్కి ఉన్న రికార్డులన్ని తిరగరాసి.. అసలు మాస్ హీరోగా నిలిచేది ఎవరంటూ ఇద్దరు హీరోల అభిమానుల్లో ఒకటే చర్చ సాగుతోంది.
- Read More Telangana News And Telugu News