Waltair Veerayya Release Live: థియేటర్లలో పూనకాలు లోడింగ్.. కుమ్మేస్తున్న వాల్తేరు వీరయ్య. | Waltair Veerayya Movie Release Live Updates starring Chiranjeevi, Ravi Teja, Shruti Haasan, fans talk theater audience reactions Telugu Filmi News
Waltair Veerayya Live Updates: సంక్రాంతి పండుగను మరింత రెట్టింపు చేస్తూ థియేటర్లలో సందడి చేయడానికి వచ్చింది వాల్తేరు వీరయ్య మూవీ. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేరు భారీ అంచనాల నడుమ విడుదలైంది. ఉదయం నుంచే థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా..

Waltair Veerayya
LIVE NEWS & UPDATES
13 Jan 2023 06:24 AM (IST)
వాల్తేరు చిత్ర యూనిట్ సందడి.
వాల్తేరు వీరయ్య మూవీ యూనిట్ ఉదయం 4 గంటలకే సినిమా వీక్షించారు. హైదరాబాద్ సంధ్య థియేటర్లో స్పెషల్ షోలో సినిమాను వీక్షించారు. దర్శకుడు బాబీతో పాటు, దేవీశ్రీ ప్రసాద్, చిరంజీవి కుమార్తెలు సినిమాను వీక్షించారు.
Waltair Veerayya Live Updates: సంక్రాంతి పండుగను మరింత రెట్టింపు చేస్తూ థియేటర్లలో సందడి చేయడానికి వచ్చింది వాల్తేరు వీరయ్య మూవీ. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేరు భారీ అంచనాల నడుమ విడుదలైంది. ఉదయం నుంచే థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. చాలా కాలం తర్వాత పక్కా మాస్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు చిరు. ఈ సినిమాలో చిరు సరసన శృతీ హాసన్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ వాల్తేరు వీరయ్య సందడి మొదలైంది. అమెరికాలో ప్రీమియర్స్ అంగరంగ వైభవంగా మొదలయ్యాయి.
అమెరాకతో పాటు, ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో మెగా ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. థియేటర్లో మెగా ఫ్యాన్స్ నినాదాలతో దద్దరిల్లిపోతోంది. మెగా స్టార్ అంటూ అభిమానులు కేరింతలు కొడుతున్నారు. థియేటర్ల వద్ద బాణా సంచాలు కాలుస్తూ పండుగ చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ థియేటర్ వద్ద మెగాస్టార్ భారీ హోర్డింగ్లతో సందడి చేస్తున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
Published On – Jan 13,2023 6:13 AM