Entertainment

Varun Sandesh: అమెరికాలో బిజినెస్.. చేతిలో 5 వేలు లేని స్థితిలోకి వచ్చేశారట.. వరుణ్ సందేశ్.. వితిక జీవితంలో చేదు జ్ఞాపకాలు..


తొలి సినిమాతోనే హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఆ తర్వాత కొత్త బంగారు లోకం సినిమాతో మరో హిట్ అందుకున్నారు. బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్స్ అందుకున్న ఈ హీరో.. ఆ తర్వాత టాప్ స్టార్‏గా మారతాడు అనుకున్నారంతా.. కానీ సినిమాల

డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు వరుణ్ సందేశ్. తొలి సినిమాతోనే హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఆ తర్వాత కొత్త బంగారు లోకం సినిమాతో మరో హిట్ అందుకున్నారు. బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్స్ అందుకున్న ఈ హీరో.. ఆ తర్వాత టాప్ స్టార్‏గా మారతాడు అనుకున్నారంతా.. కానీ సినిమాల ఎంపిక విషయంలో చేసిన చిన్న చిన్న పొరపాట్లతో వరుసగా డిజాస్టర్స్ ఖాతాలో వేసుకున్నారు. ఏమైంది ఈవేళ, మరో చరిత్ర వంటి సినిమాలు పాజిటివ్ టాక్ అందుకున్నప్పటికీ ప్రేక్షకులను మాత్రం మెప్పించలేకపోయాయి. కానీ హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న సమయంలోనే తన తోటి నటి వితిక షేరుతో పరిచయం ఏర్పడింది. వీరి స్నేహం కాస్త ప్రేమగా మారి పెళ్లి బంధంతో ఒకటయ్యారు. పెళ్లి తర్వాత యూఎస్ వెళ్లిన వీరిద్దరూ కొద్ది రోజులకే తిరిగి వచ్చేశారు. ఆ సమయంలో తాము ఎన్నో కష్టాలు పడినట్లు ఇటీవల ఓ గేమ్ షోలో చెప్పారు వితిక.

యూఎస్ వెళ్లిన తర్వాత అక్కడ ఓ బిజినెస్ పెట్టాలనే ఆలోచన చేశారట. కానీ అక్కడ వర్కౌట్ కాకపోవడంతో.. ఆర్థికంగా నష్టపోయారట. కనీసం చేతిలో ఐదు వేలు కూడా లేని స్థితికి వచ్చేశారట. కానీ తమకెప్పుడూ కార్లు కొనాలి.. బంగ్లాలు కొనాలనే ఆశలు లేని.. ఒకరంటే మరొకరికి సంతోషంగా ఉండడమే ముఖ్యమని అన్నారు. వరుణ్ సంతోషంగా ఉంటే చూడాలని తనకు.. తను సంతోషంగా ఉంటే చూడాలని వరుణ్ కు ఉంటుందని చెప్పుకొచ్చింది వితిక.

ఇవి కూడా చదవండి



వీరిద్దరు కలిసి బిగ్ బాస్ మూడో సీజన్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ షో ద్వారా వరుణ్ మంచి మార్కులు కొట్టేయగా..వితికికు కాస్త నెగిటివిటి వచ్చేసింది. ఇటీవల విడుదలైన మైఖెల్ చిత్రంలో వరుణ్ కీలకపాత్రలో నటించారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button