News

Vishwak Sen: ‘జోహార్ ఎన్టీఆర్.. తెలుగోడి ఆత్మగౌరవం’.. అదిరిపోయిన విశ్వక్ సేన్ మాస్ లుక్.. – Telugu News | Vishwak Sen’s VS11 Movie First Look poster Released telugu cinema news


తాజాగా ఈ మూవీ నుంచి విశ్వక్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. అందులో విశ్వక్ మాస్ అండ్ రఫ్ లుక్‏లో సిగార్ తాగుతున్నట్లుగా కనిపిస్తున్నారు. అంతేకాకుండా.. ఈరోజు నందమూరి తారకరామారావు శతజయంతి కావడంతో ఆయనకు నివాళులు అర్పిస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినట్లుగా తెలుస్తోంది.

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‏తో దూసుకుపోతున్నాడు. ఇటీవలే దాస్ కా ధమ్కీ సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న ఈ యంగ్ హీరో.. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టు పనిలో బిజీగా ఉన్నాడు. రౌడీ ఫెలో ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ ఓ మూవీ చేస్తున్నారు. ప్రస్తుతానికి VS11 అనే వర్కింగ్ టైటిల్‏తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితార బ్యానర్ పై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి విశ్వక్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. అందులో విశ్వక్ మాస్ అండ్ రఫ్ లుక్‏లో సిగార్ తాగుతున్నట్లుగా కనిపిస్తున్నారు. అంతేకాకుండా.. ఈరోజు నందమూరి తారకరామారావు శతజయంతి కావడంతో ఆయనకు నివాళులు అర్పిస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినట్లుగా తెలుస్తోంది.

“జోహార్ ఎన్టీఆర్.. తెలుగోడి ఆత్మగౌరవం” అంటూ క్యాప్షన్ ఇస్తూ రిలీజ్ చేసిన విశ్వక్ సేన్ ఫస్ట్ లుక్ పోస్టర్.. సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. చాలా కాలం తర్వాత విశ్వక్ ఫుల్ మాస్ అండ్ రగ్గడ్ లుక్‏లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది.

ఇవి కూడా చదవండి



ఇందులో అంజలి కథానాయికగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. విశ్వక్ కెరీర్ లో 11వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



Related Articles

Back to top button