News

vishnu manchu, Karthikeya 2 Movie: తమ్ముడు నీకు నేనున్నాను!.. నిఖిల్‌కు మంచు విష్ణు అండ.. నెటిజన్ల ట్రోలింగ్ – vishnu manchu supports nikhil karthikeya 2 movie


మంచు విష్ణు (vishnu manchu) మీద సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ గురించి అందరికీ తెలిసిందే. మంచు విష్ణు మా ప్రెసిడెంట్‌గా చేసే పనులు, వేసే పోస్టుల మీద కూడా సెటైర్లు పడుతుంటాయి. ఇక తాజాగా మంచు విష్ణు నిఖిల్‌(nikhil)కు మద్దతుగా నిలవడంపై రకరకాలుగా కామెంట్లు వస్తున్నాయి. కార్తికేయ 2 (karthikeya 2) మూవీ విషయంలో నిఖిల్‌కు ఎదురవుతున్న అనుభవాల గురించి బాధపడ్డాడు. తనకు థియేటర్లు దొరకడం లేవని, సినీ ఇండస్ట్రీలోని రాజకీయాలతో తాను విసిగిపోయానంటూ బాదపడ్డాడు నిఖిల్.

ఇక ఈ విషయంలో నిఖిల్‌కు జనాల నుంచి మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలోనే మంచు విష్ణు ఓ ట్వీట్ వేశాడు. నేనున్నాను అంటూ ముందుకు వచ్చాడు. ఈ విషయం మీదే మంచు విష్ణుని నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. నీకే దిక్కు లేదు నువ్ వస్తావా? అని దారుణంగా కామెంట్లు పెడుతున్నారు.

నా తమ్ముడా నిఖిల్.. నీకు నేనున్నాను.. నీ కోసం నేను ఎప్పటికీ నిల్చుంటాను.. ధైర్యంగా ఉండు..మంచి కంటెంట్ వస్తే అదే నిలబడుతుంది.. అది అందరూ అంగీకరించాల్సిన వాస్తవం.. కార్తికేయ 2 కోసం నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను అని మంచు విష్ణు ట్వీట్ వేశాడు. ఇక ఈ ట్వీట్‌కు నిఖిల్ ఉప్పొంగిపోయాడు. విష్ణు భాయ్ నీ మాటలు మా టీంకు కొండంత అండను ఇస్తున్నాయ్ అని నిఖిల్ రిప్లై ఇచ్చాడు.

ఇక మంచు విష్ణు వేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో ట్రోలింగ్‌కు గురవుతోంది. సన్ ఆఫ్ ఇండియా 2 అప్డేట్ ఎప్పుడు.. సన్ ఆఫ్ ఇండియా రికార్డులను కార్తికేయ 2 బ్రేక్ చేయాలి.. అంటూ ఇలా పలు రకాలుగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక కొందరు అయితే ముందు మా బిల్డింగ్ సంగతి ఏమైందో చెప్పు అంటూ నిలదీస్తున్నారు.

అలా మంచు విష్ణు ఇప్పుడు మరోసారి నెట్టింట్లో చర్చను లేవనెత్తాడు. మరి మంచు విష్ణు ఏ సినిమా గురించి ట్వీట్ వేసినా అది డిజాస్టర్‌గా మారుతోంది.. ఇక కార్తికేయ 2 విషయంలోనూ అది నిజమవుతుందా? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

Back to top button