Entertainment

Hero Karthi: హీరో కార్తీ మారిపోయారా? తెలుగు మార్కెట్‌‌ను లైట్ తీసుకుంటున్నారా?


తమిళ హీరోల్లో మొన్నటి వరకు తెలుగు మార్కెట్‌ను సీరియస్‌గా ఫోకస్‌ చేశారు నటుడు కార్తీ (Hero Karthi). కెరీర్‌ స్టార్టింగ్‌ నుంచే తెలుగు, తమిళ మార్కెట్‌లను బ్యాలెన్స్ చేస్తున్న ఈ యంగ్ హీరో.. తన ప్రతీ సినిమాను తమిళ్‌తో పాటు తెలుగులోనూ భారీగా రిలీజ్ చేస్తున్నారు.

Hero Karthi: తెలుగు సినిమాలు పాన్ ఇండియా రేంజ్‌ని కూడా దాటేస్తుంటే.. తమిళ తంబీలు మాత్రం ఓన్లీ రీజినల్‌ అంటూ మడికట్టుకు కూర్చుకుంటున్నారు. తమకు కాస్త మార్కెట్‌ ఉన్న టాలీవుడ్ మార్కెట్ విషయంలో కూడా సీరియస్‌గా కాన్సన్‌ట్రేట్ చేయటం లేదు. తాజాగా హీరో కార్తీ కూడా ఈ లిస్ట్‌లో చేరిపోయారు. తమిళ హీరోల్లో మొన్నటి వరకు తెలుగు మార్కెట్‌ను సీరియస్‌గా ఫోకస్‌ చేశారు నటుడు కార్తీ. కెరీర్‌ స్టార్టింగ్‌ నుంచే తెలుగు, తమిళ మార్కెట్‌లను బ్యాలెన్స్ చేస్తున్న ఈ యంగ్ హీరో.. తన ప్రతీ సినిమాను తమిళ్‌తో పాటు తెలుగులోనూ భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఓన్‌గా డబ్బింగ్ చెప్పటం… ప్రమోషన్‌ ఈవెంట్స్‌లోనూ తెలుగులో మాట్లాడుతూ టాలీవుడ్ ఆడియన్స్‌ను తన వైపు తిప్పుకున్నారు.

టాలీవుడ్‌ను ఇంత సీరియస్‌గా తీసుకున్న కార్తీ ఇప్పుడు ఒక్కసారిగా మారిపోయారు. తన నెక్ట్స్ సినిమా విషయంలో తెలుగు ఆడియన్స్‌ను లైట్‌ తీసుకున్నారు కార్తీ. చాలా రోజులుగా వాయిదా పడుతున్న విరుమాన్ సినిమా(Viruman Movie) ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తమిళ రిలీజ్ విషయంలో క్లారిటీ ఇచ్చిన మేకర్స్ టాలీవుడ్‌కు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. కనీసం రిలీజ్‌ డేట్‌ పోస్టర్ కూడా ఇవ్వలేదు.

బీస్ట్‌, విక్రమ్ లాంటి తమిళ సినిమాల విషయంలోనూ ఇలాగే జరిగింది. లాస్ట్ మినిట్‌ వరకు తెలుగు రిలీజ్‌ విషయంలో క్లారిటీ ఇవ్వకుండా.. సడన్‌గా సినిమాను ఆడియన్స్‌ ముందుకు తీసుకువచ్చారు. దీంతో గ్రాండ్‌గా పెర్ఫామ్ చేయాల్సిన సినిమాలు సో సో అనిపించి సరిపెట్టేశాయి.

ఇప్పుడు కార్తీ కూడా టాలీవుడ్‌ను లైట్‌ తీసుకోవటంతో తమిళ స్టార్స్‌ ఎందుకిలా చేస్తున్నారన్న చర్చ మొదలైంది. కార్తీ సినిమాలకు తెలుగులో మంచి మార్కెట్‌ ఉంది. అయినా ఆ క్రేజ్‌ను క్యాష్ చేసుకోకపోవటంతో కార్తీ అభిమానులు కూడా ఫీల్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

Advertisementమరిన్ని సినిమా వార్తలు చదవండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Articles

Back to top button