శ్రీలంకతో స్వదేశంలోనే జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీతో చెలరేగాడు. ఆరంభం నుంచి భీకర బ్యాటింగ్‌ను ప్రదర్శించిన కోహ్లి 80 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. 87 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌తో 113 పరుగులు చేశాడు. ఈ సెంచరీతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును కింగ్ కోహ్లీ బద్దలు కొట్టాడు..
Jan 11, 2023 | 8:36 AM
శ్రీలంకతో స్వదేశంలోనే జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీతో చెలరేగాడు. ఆరంభం నుంచి భీకర బ్యాటింగ్‌ను ప్రదర్శించిన కోహ్లి 80 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. 87 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌తో 113 పరుగులు చేశాడు. ఈ సెంచరీతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును కింగ్ కోహ్లీ బద్దలు కొట్టాడు.
మొదటి రికార్డ్ ఏమిటంటే.. శ్రీలంకపై అత్యధిక వన్డే సెంచరీలు చేసిన రికార్డును ఇప్పటివరకు సచిన్ టెండూల్కర్ కలిగి ఉన్నాడు. క్రికెట్ దేవుడు లంకపై 8 అద్భుతమైన సెంచరీలు చేశాడు.
గువాహతిలో జరిగిన మొదటి వన్డేలో శ్రీలంకపై సెంచరీతో చెలరేగిన కింగ్ కోహ్లీ.. శ్రీలంకపై అత్యధిక సెంచరీలు చేసి సచిన్ పేరిట ఉన్న రికార్డును తిరగ రాశాడు. అంతేకాకుండా లంకపై కోహ్లి ఇప్పటివరకు 9 సెంచరీలు సాధించాడు.
మరో రికార్డు ఏమిటంటే.. భారత్‌లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా కోహ్లీ సమం చేశాడు. సచిన్ స్వదేశంలో 164 వన్డేల్లో 20 సెంచరీలు సాధించాడు.
ఇప్పుడు శ్రీలంకపై సెంచరీతో కోహ్లీ కూడా భారత పిచ్‌పై 20 సెంచరీలను పూర్తి చేసుకున్నాడు. విశేషమేమిటంటే.. స్వదేశంలో 20 సెంచరీలు చేసేందుకు కోహ్లీకి 102 ఇన్నింగ్స్‌లు మాత్రమే పట్టాయి. దీంతో హోమ్ సెంచరీ కెప్టెన్‌గా మాస్టర్ బ్లాస్టర్ పేరిట ఉన్న మరో రికార్డును కింగ్ కోహ్లీ సమం చేశాడు. కోహ్లీ కనుక స్వదేశీ గడ్డపై మరో సెంచరీ చేస్తే.. భారత్ పిచ్‌లపై అత్యధిక సెంచరీలను చేసిన బ్యాట్స్మ్యాన్వగా విరాట్ సరికొత్త రికార్డును సృష్టిస్తాడు.