News

Virat Kohli: కోహ్లికి షాకిచ్చిన డివిలియర్స్.. దోస్త్ అంటూనే ఇదేందయ్యా..!



విరాట్ కోహ్లి, మధ్య ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. ఆర్సీబీ ఆటగాళ్లయిన వీరిద్దరి మధ్య అన్నదమ్ముల తరహాలో అనుబంధం ఉంది. ఏళ్లపాటు వీరిద్దరూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీకి బ్యాటింగ్ విభాగంలో వెన్నెముకగా నిలిచారు. తమ ఆటతో అభిమానులను అలరించిన ఈ ద్వయం.. అద్భుతమైన భాగస్వామ్యాలను నెలకొల్పింది. సందర్భం దొరికినప్పుడల్లా ఒకరి గురించి మరొకరు గొప్పగా ప్రస్తావిస్తుంటారు.అన్ని ఫార్మాట్ల నుంచి క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన డివిలియర్స్.. ఆర్సీబీతో ఏదో ఒకరకంగా అనుబంధాన్ని కొనసాగిస్తానని చెప్పాడు. మరోవైపు కోహ్లి బెంగళూరు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పటికీ.. ఆ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇద్దరి మధ్య సోదరభావం ఉన్నప్పటికీ.. పొట్టి ఫార్మాట్లో దిగ్గజ ఆటగాడు ఎవరనే విషయంలో మాత్రం డివిలియర్స్ అనూహ్యంగా కోహ్లిని పక్కనబెట్టాడు.టీ20 ఫార్మాట్లో ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం – గోట్’ ఆటగాడు ఎవరనే విషయమై మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ స్పందన కోహ్లి ఫ్యాన్స్‌కు నిరుత్సాహం కలిగించింది. టీ20ల్లో గోట్‌గా అప్ఘానిస్తాన్ ఆటగాడు రషీద్ ఖాన్‌ను ఏబీడీ ఎంపిక చేశాడు.24 ఏళ్ల .. బ్యాట్‌తో, బంతితో మ్యాచ్ గమనాన్ని మార్చేయగలడని డివిలియర్స్ చెప్పాడు. రషీద్ ప్రధానంగా లెగ్ స్పిన్నర్ అయినప్పటికీ.. తనదైన రోజున బ్యాటింగ్‌లోనూ విధ్వంసం సృష్టించగలడు. అతడు మంచి ఫీల్డర్ కూడా. ఈ మూడు క్వాలిటీస్ ఉన్న అతడు.. నిజమైన ఆల్‌రౌండర్.నా వరకు ఆల్ టైమ్ గ్రేటెస్ట్ టీ20 ప్లేయర్ రషీద్ ఖాన్. అతడు బ్యాట్‌తో, బంతితో రాణిస్తాడు. రెండు విభాగాల్లోనూ మ్యాచ్ విన్నర్. మైదానంలో మెరుపులా కదులుతాడు’ అని సూపర్ స్పోర్ట్స్ టీవీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన వీడియోలో డివిలియర్స్ వ్యాఖ్యానించాడు.‘రషీద్ ఖాన్ ఎప్పుడూ గెలవాలని కోరుకుంటాడు. ఎంతో పోటీతత్వం ఉన్న ఆటగాడు. బెస్ట్ టీ20 ఆటగాళ్లలో అతడొకడు. కాదు కాదు.. అతడే బెస్ట్’ అని ఏబీడీ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.అంతర్జాతీయ టీ20ల్లో కోహ్లి చేసినన్ని పరుగులు మరే క్రికెటర్ చేయలేదు. ఐపీఎల్‌లో అతడే లీడింగ్ రన్ స్కోరర్. అయినప్పటికీ కోహ్లిని ది బెస్ట్ టీ20 ప్లేయర్‌గా ఏబీడీ ప్రస్తావించకపోవడం పట్ల అతడి ఫ్యాన్స్ మండిపడుతున్నారు. రషీద్ ఖాన్ విషయానికి వస్తే.. అప్ఘాన్ జట్టు తరఫున మాత్రమే కాకుండా.. ఐపీఎల్ సహా ప్రపంచంలోని పేరొందిన టీ20 లీగ్‌లన్నింటిలో అతడు ఆడుతున్నాడు. బహుశా అందుకే.. టీ20ల్లో ది గ్రేటెస్ట్ క్రికెటర్‌గా రషీద్ ఖాన్‌ను ఏబీ డివిలియర్స్ ఎంపిక చేసి ఉంటాడు.

Related Articles

Back to top button