Entertainment

Viral Video: పుష్పరాజ్‌గా మారిన విక్రమ్‌.. అపరిచితుడు వేరియషన్స్‌లో బన్నీ డైలాగ్‌ చెప్పిన చియాన్‌


Vikram Cobra: టాలీవుడ్ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా నటించిన పుష్ప (Pushpa) చిత్రం ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఇందులోని డైలాగులైతే ఓ రేంజ్‌లో పేలాయి. ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు బన్నీ డైలాగ్స్ ను తమదైన శైలిలో అనుకరించి ఆకట్టుకున్నారు.

Vikram Cobra: టాలీవుడ్ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా నటించిన పుష్ప (Pushpa) చిత్రం ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఇందులోని డైలాగులైతే ఓ రేంజ్‌లో పేలాయి. ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు బన్నీ డైలాగ్స్ ను తమదైన శైలిలో అనుకరించి ఆకట్టుకున్నారు. తాజాగా కోలీవుడ్‌ స్టార్‌ హీరో చియాన్‌ విక్రమ్‌ (Chiyaan Vikram) కూడా ఈ జాబితాలో చేరిపోయారు. తన అప్‌కమింగ్‌ మూవీ కోబ్రా ప్రమోషన్లలో భాగంగా తాజాగా మధురైలో ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. హీరో హీరోయిన్లు విక్రమ్‌, శ్రీనిధి శెట్టి తదితరులు ఈ ఈవెంట్‌లో సందడి చేశారు. ఈ సందర్భంగా ‘పుష్ప సినిమాలోని డైలాగ్‌ చెప్పరా ప్లీజ్‌’ అని ఒకరు కోరగా..’ఒక రకంగా కాదు పది రకాలుగా చెప్తా’ అంటూ విక్రమ్‌ రిప్లై ఇచ్చారు. తాను గతంలో హీరోగా నటించిన అపరిచితుడు సినిమాలోని వివిధ పాత్రల్లోని వేరియేషన్స్‌ను మరోసారి గుర్తుచేస్తూ ‘పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకుంటివా.. ఫైరు’ అనే డైలాగ్‌ చెప్పి అలరించారు చియాన్‌.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అటు బన్నీ ఫ్యాన్స్‌, ఇటు విక్రమ్‌ అభిమానులు దీనిని షేర్‌ చేసుకుంటూ తెగ మురిసిపోతున్నారు. కాగా కోబ్రా సినిమా ఈనెల 31న గ్రాండ్‌గా రిలీజ్‌కానుంది. అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వం తెరకెక్కించిన ఈ సినిమాలో విభిన్న గెటప్పుల్లో కనిపించనున్నారు విక్రమ్‌. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, మృణాళిని రవి, కె.ఎస్‌. రవికుమార్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అలాగే క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ కూడా ఓ ముఖ్య పాత్రలో సందడి చేయనున్నారు. 7 స్క్రీన్‌ స్టూడియో సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి ఎ. ఆర్‌. రెహమాన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి



లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



Related Articles

Back to top button