News

Viral Video: వాష్‌రూమ్‌కు వెళ్లి టాయిలెట్‌ క్యాప్‌ ఓపెన్‌ చేశాడంతే.. సీన్‌ చూసి గుండె గుబేల్‌.. | Gray rat snake found in toilet video goes viral Telugu Trending News


Viral Video: ఒక్కోసారి జీవితంలో ఎదురైన సంఘటనలు గుండె ఉలిక్కిపడేలా చేస్తాయి. కళ్ల ముందు కనిపించే భయానక దృశ్యాలు గుండె గుబేల్ మనిపిస్తాయి. తాజాగా అమెరికాకు చెందిన ఓ వ్యక్తికి ఇలాంటి ఓ షాకింగ్ ఇన్సిడెంట్‌ ఎదురైంది. వాష్‌రూమ్‌కు వెళ్దామని…

Viral Video: ఒక్కోసారి జీవితంలో ఎదురైన సంఘటనలు గుండె ఉలిక్కిపడేలా చేస్తాయి. కళ్ల ముందు కనిపించే భయానక దృశ్యాలు గుండె గుబేల్ మనిపిస్తాయి. తాజాగా అమెరికాకు చెందిన ఓ వ్యక్తికి ఇలాంటి ఓ షాకింగ్ ఇన్సిడెంట్‌ ఎదురైంది. వాష్‌రూమ్‌కు వెళ్దామని టాయిలెట్ క్యాప్‌ ఓపెన్‌ చేయగా కనిపించిన దృశ్యంతో ఒక్కసారిగా గుండె జారినంత పనైంది. ఇంతకీ ఏమైందనేగా మీ సందేహం అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని అలబామా రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో బాత్‌రూమ్‌కి వెళ్లాడు. అదే సమయంలో వెస్ట్రర్న్‌ టాయిలెట్‌ క్యాప్‌ను ఓపెన్‌ చేశాడు. అందులో ఓ పాము కదులుతూ కనిపించింది. దీంతో ఒక్కసారిగా షాక్‌ అయిన ఇంటి యజమాని వెంటనే వెస్ట్రన్‌ క్యాప్ ను మూసేసి అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు. వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్‌ చేసే విషయం చెప్పడంతో.. ఇంటికి చేరుకున్న అధికారులు ఆ పామును తీసుకొని వెళ్లిపోయారు.

ఇదిలా ఉంటే టాయిలెట్‌లోకి ఇలా అనుకోని అతిథి దర్శనం ఇవ్వడం ఇది మూడోసారని సదరు ఇంటి యజమాని చెప్పడం గమనార్హం. గతంలోనూ ఇలాంటివి కొన్ని టాయిలెట్ లోకి వచ్చినట్లు ఆ ఇంటి యజమాని చెప్పాడు. అప్పట్లో ఆ సంఘటనకు సంబంధించిన వార్త అమెరికా మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఈ విషయం తెలిసిన ఆ ప్రాంత ప్రజలు టాయిలెట్‌ క్యాప్‌ చేయాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఇక తాజాగా పాము కనిపించిన ఘటనకు సంబంధించి వివరాలను అలబామా పోలీసులు ఫేస్ బుక్ వేదికగా పంచుకున్నారు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

Advertisement

ఇవి కూడా చదవండి



లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Articles

Back to top button