News

Viral Video: వామ్మో.. పాము ఆకారంతో భయంకరమైన చేప.. సెకన్లలోనే పీతను నమిలి మింగేసింది.. వైరల్‌ వీడియో | Strange and weird fish chewed on live crab in a jiffy, watch viral video Telugu Trending News


Weird Fish: భూమిపై వివిధ రకాల జీవులు ఉన్నట్లే సముద్రం కూడా వింతైన జీవజాతులకు నిలయం. అందులో కొన్ని ప్రమాదకరమైన జంతువులు కూడా ఉంటాయి. అందులో కొన్ని చేపలు కూడా ఉన్నాయి. అందులోనూ షార్క్ , స్టోన్ ఫిష్, క్యాట్ ఫిష్, పఫర్ ఫిష్ మరియు పిరానా చేపలు మరీ ప్రమాదకరం.

Weird Fish: భూమిపై వివిధ రకాల జీవులు ఉన్నట్లే సముద్రం కూడా వింతైన జీవజాతులకు నిలయం. అందులో కొన్ని ప్రమాదకరమైన జంతువులు కూడా ఉంటాయి. అందులో కొన్ని చేపలు కూడా ఉన్నాయి. అందులోనూ షార్క్ , స్టోన్ ఫిష్, క్యాట్ ఫిష్, పఫర్ ఫిష్ మరియు పిరానా చేపలు మరీ ప్రమాదకరం. ఎంతో బలంగా ఉండే ఈ జంతువులు చిన్న జీవాలను క్షణాల్లో వెంటాడి ఆహారంగా మార్చుకుంటాయి. ఈ నేపథ్యంలో ఒక వింత చేపకు సంబంధించిన వీడియో నెట్టింట్లో బాగా వైరలవుతోంది. దీనిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కొందరైతే భయాందోళనకు గురవుతున్నారు. ఈ వీడియోలో, వింతగా కనిపించే ఒక చేప పీతను మింగడం మనం చూడవచ్చు. అచ్చం పాము అకారంలో చూడడానికి ఎంతో భయంకరంగా ఉందీ వింత చేప.

ఈ వీడియోలో ఒక వ్యక్తి అక్వేరియంలో ఉన్న వింత చేపకు పీతను చూపిస్తాడు. ఆ వెంటనే పీతను కూడా అందులోకి వదులుతాడు. దొరికిందే తడవు అన్నట్లుగా పీతను అమాంతం మింగేస్తుంది చేప. పీత కాళ్లు పట్టుకుని తర్వాత కరకరనమిలేస్తుంది. ఇలా కొన్ని సెకన్లలోనే చేపకు ఆహారంగా మారిపోతుంది పీత. @natureisbruta1 అనే ట్విట్టర్‌ ఐడీతో షేర్‌ చేసిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. 41 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను లక్షలాది మందికి పైగా వీక్షించారు. ‘వామ్మో..ఇదేంటి ఇంత భయంకరంగా ఉంది. అసలు దీని పేరేంటి’ అని అడుగుతూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

Advertisement



మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



Related Articles

Back to top button