Viral Video: వామ్మో ఇదెక్కడి మ్యాజిక్.. కోతి రియాక్షన్ చూస్తే.. పడిపడి నవ్వాల్సిందే.. | Netizens cant stop watching this monkey’s reaction to a magic trick video goes viral telugu viral news
ఈ వీడియోలో హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే వ్యక్తి చేసిన మ్యాజిక్ చూసి కోతి ఇచ్చిన రియాక్షన్ చూస్తే మాత్రం పడిపడి నవ్వుకోవాల్సిందే.
సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వచ్చి చేరుతుంటాయి. వీటిలో కొన్ని నెటిజన్లను ఆకట్టుకోవడంతో తెగ వైరల్ అవుతుంటాయి. ఇందులో జంతువులకు సంబంధించిన వీడియోలు ప్రధమస్థానంలో నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట్లోకి వచ్చి చేరింది. ఓ వ్యక్తి జూకి వెళ్లి అక్కడ ఓ కోతికి తన మ్యాజిక్ ట్రిక్ చూపించాడు. కోతి ఇలాంటి మాయాజాలాన్ని తొలిసారి చూసినట్లుగా, ఓ వింత ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం చూసి, నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియోలో హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే, ఆ వ్యక్తి చేసిన మ్యాజిక్ చూసి కోతి ఇచ్చిన రియాక్షన్ చూస్తే పడిపడి నవ్వుకోవాల్సిందే. ఈ వైరల్ వీడియో పుబిటి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేశారు. కోతి రియాక్షన్ నచ్చడంతో ఈ వీడియో 12 మిలియన్లకు పైగా వ్యూస్‌తో నెట్టింట్లో తన సత్తా చాటుతోంది.
వైరల్ అవుతున్న వీడియోలో, వ్యక్తి జూలో ఒక కోతికి మ్యాజిక్ ట్రిక్స్ చూపిస్తున్నట్లు చూడొచ్చు. అయితే కోతి అతను ఏమి చేస్తున్నాడో చూడాలనే ఆసక్తితో వ్యక్తిని గమనిస్తున్నట్లు చూడొచ్చు. ఆ వ్యక్తి ఓ మ్యాజిక్ చేసి, ఓ వస్తువును మాయం చేయగా, కోతి కాసేపు ఆలోచించి, ఆశ్చర్యపోయినట్లుగా వింతగా రియాక్షన్ ఇస్తుంది. ప్రజలు కోతి ప్రతిచర్యను చాలా ఇష్టపడ్డారు. ఫన్నీ కామెంట్లతో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ నెవ్వర్ భిపోర్, ఎవర్ ఆఫ్టర్ అంటూ స్పందిస్తున్నారు.
లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి