Viral Video: మీరు ఎప్పుడైనా బైక్‌ని ఇలా తీసుకుని వెళ్ళారా.. అయితే వైరల్ అవుతున్న వీడియోపై ఓ లుక్ వేయండి.. | Man carrying bike on bike through jugaad video goes viral on social media
ఖాతాదారుడు వాయిదాల పద్ధతిలో బైక్‌ను తీసుకున్నాడని.. అతను ఆ వాయిదాలను తిరిగి చెల్లించలేకపోయాడని.. దీంతో రుణం తీసుకున్నవారు ఇప్పుడు ఈ బైక్‌ను తీసుకెళ్తున్నారని చెబుతున్నారు.
దేశీయ జుగాడ్ విషయంలో భారతీయులు భిన్నమైన పద్దతులను అవలంభిస్తారు. రకరకాల జుగాడ్ లు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని రకాల జుగాడ్ లు చూస్తే పెద్ద ఇంజనీర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. చెప్పాలంటే.. కొందరిలో ఉన్న ప్రతిభ కూడా అడగని క్రోడీకరణతో నిండి ఉంటుంది. తాజాగా ఒక జుగాడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఎందుకంటే ఇక్కడ ఒక వ్యక్తి బైక్ పైన బైక్‌ను మోస్తున్నాడు.
తరచుగా మీరు ఓవర్‌లోడ్ వాహనాలను చూసి ఉంటారు. కొన్నిసార్లు 21 మందిని ఆటోపై కూర్చోబెడితే.. మరికొన్ని కొన్నిసార్లు కుటుంబం మొత్తం బైక్‌పై వెళ్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న వీడియో మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే మీ జీవితంలో బైక్‌పై బైక్‌ను తీసుకెళ్లే రైడర్‌ని మీరు ఎప్పుడైనా చూసి ఉండరు కనుక. వింతగా అనిపించే ఈ సంఘటన పూర్తిగా నిజం.. ఈ వీడియో ఇంటర్నెట్‌లో ఎక్కువగా వైరల్ అవుతోంది.
ఇక్కడ వీడియో చూడండి..
It is being claimed that after a man from #Vaijapur in #Aurangabad defaulted on his bike #loan installments, #Finance company’s #recovery agents seize his bike, n unable to start, carried it on their 2wheeler#Maharashtra
AdvertisementVia-@MohammedAkhef pic.twitter.com/RVGTFe3AZU
— Siraj Noorani (@sirajnoorani) March 17, 2023
వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక బైక్‌పై ఇద్దరు యువకులు వెళ్తున్నారు. ఒకరు బైక్ డ్రైవ్ చేస్తుండగా.. రెండో వ్యక్తి ఇద్దరి మధ్య ఒక బైక్ ను పెట్టుకుని పట్టుకుని ఉన్నాడు. ఓ బైక్ ని ఇంకో బైక్ కి బిగించారు. ఈ వీడియో మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందినదని తెలిసింది. ఖాతాదారుడు వాయిదాల పద్ధతిలో బైక్‌ను తీసుకున్నాడని.. అతను ఆ వాయిదాలను తిరిగి చెల్లించలేకపోయాడని.. దీంతో రుణం తీసుకున్నవారు ఇప్పుడు ఈ బైక్‌ను తీసుకెళ్తున్నారని చెబుతున్నారు.
ఈ వీడియోను సిరాజ్ నూరానీ అనే ఖాతా ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఈ వీడియో రాసే వరకు వందల కొద్దీ లైక్‌లు, వీక్షణలు వచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి