News

Viral Video: నడి రోడ్డుపై పొట్టు పొట్టుగా కొట్టుకున్న ఇద్దరు వృద్ధులు.. షాకింగ్ వీడియో వైరల్ – Telugu News | 2 elderly men park bikes midway and indulge in dramatic fight with each other Watch Viral Video


సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంటుంది.. కొన్ని సంఘటనలకు సంబంధించిన షాకింగ్ దృశ్యాలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా.. ఇద్దరు వృద్ధుల కొట్లాటకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంటుంది.. కొన్ని సంఘటనలకు సంబంధించిన షాకింగ్ దృశ్యాలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా.. ఇద్దరు వృద్ధుల కొట్లాటకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసి.. అందరూ ఎందుకు ఇలా కొట్టుకున్నారంటూ షాకవుతున్నారు. ఇద్దరూ నివాస ప్రాంతాల్లోని ఓ రోడ్డు గుండా వస్తున్నారు. ఈ క్రమంలో నడిరోడ్డుపై ద్విచక్రవాహనాలు ఆపి వాగ్వాదానికి దిగారు. మాటమాట పెరిగి.. ఓ వృద్ధుడు మ‌రో వృద్ధుడిపై చేయిచేసుకున్నాడు. అనంతరం ఇద్దరు దాదాపు చాలాసాపు కొట్లాడుకున్నారు. ప్రస్తుతం ఈ వృద్ధుల ఫైటింగ్ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

ఈ ఘటన మ‌హారాష్ట్ర ఔరంగాబాద్‌లోని ఓ వీధిలో చోటుచేసుకుంది. ఒక‌రు బైక్‌పై, మ‌రొక‌రు స్కూటీపై ఆ రోడ్డుపై వస్తున్నారు. ఏమైందో ఏమో తెలియ‌దు కానీ.. ఇద్దరూ న‌డిరోడ్డుపై ద్విచ‌క్ర వాహ‌నాల‌ను ఆపి ఒక‌రినొక‌రు దూషించుకున్నారు. అంత‌లోనే ఓ వృద్ధుడు మ‌రో వృద్ధుడిపై చేయి చేసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకున్నారు. దాదాపు రెండు నిమిషాల పాటు పొట్లాడుకున్నారు. అనంత‌రం ఇద్దరూ ఎవ‌రి దారినా వారు వెళ్లిపోయారు. అస‌లు వారిద్దరూ ఎందుకు కొట్టుకున్నార‌నే విష‌యం మాత్రం తెలియరాలేదు.

ఇవి కూడా చదవండి



వీడియో చూడండి..

ఈ ఘటన మే 18న ఉదయం 6 గంటలకు జరిగిందని సీసీ టీవీ ఫుటేజీలో కనిపిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



Related Articles

Back to top button