Viral Video: కొడుకు బర్త్‌డే వేడుకల్లో డ్యాన్స్ చేసిన జేసీ ప్రభాకర్.. టీడీపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ – Telugu News | Tadipatri TDP leader Jc Prabhakar Reddy Dance Video Goes Viral
JC Prabhakar Dance Video: మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఏం చేసినా సంచలనమే. అది అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేయడమైనా.. కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ చేసినా స్పెషలే.
మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఏం చేసినా సంచలనమే. అది అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేయడమైనా.. కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ చేసినా స్పెషలే. ఆయన చేసే ప్రతి పని మీదా మీడియా ఫోకస్ విపరీతంగా ఉంటుంది. నేరుగా విషయంలోకి వస్తే.. ఇక్కడ అభిమానులతో కలిసి చిందేస్తున్నది జేసీ ప్రభాకర్‌రెడ్డే. కొడుకు అస్మిత్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలు జేసీ డ్యాన్స్ కు వేదిక అయ్యాయి. పార్టీ కార్యకర్తలు కూడా జేసీతో కలిసి డ్యాన్స్ చేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి డ్యాన్స్ టీడీపీ శిబిరంలో సంతోషాన్ని తీసుకొచ్చింది. జేసీ ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యింది. జేసీ ఇలా బహిరంగ వేదికలపై డ్యాన్స్ చేయడం ఇదేమీ కొత్తకాదు. గతంలోనూ పార్టీ కార్యక్రమాల్లో ఆయన డ్యాన్స్ చేసి అందరినీ ఆకర్షించారు.
అయితే ఇది వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి మాత్రం ఓ విమర్శనాస్త్రం దొరికింది. ఇంకేముందీ.. తనదైన శైలిలో జేసీ ప్రభాకర్‌పై పొలిటికల్ పంచ్‌లు వేశారు. 73 ఏళ్ల వయస్సులో జేసీకి డ్యాన్స్ అవసరమా? అని ఎద్దేవా చేశారు. తాడిపత్రిలో తాను రౌడీ అంటూ 30 ఏళ్లు పెత్తనం చెలాయించిన జేసీ పరిస్థితి.. నేడు డ్యాన్స్ చేసుకోవాల్సిన పరిస్థితికి దిగజారిపోయిందన్నారు. ఎవరి ఇళ్లలో అయినా బర్త్ డే ఉంటే పిలిస్తే వచ్చి డ్యాన్స్ చేస్తా అన్నట్లు జేసీ తీరు ఉందంటూ పెద్దారెడ్డి సెటైర్లు వేశారు. మొత్తానికి జేసీ ప్రభాకర్ రెడ్డి డ్యాన్స్ వ్యవహారం అనంతపురం జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
మరిన్ని ఏపీ వార్తలు చదవండి..