Viral Photo: ఈ ఫోటోలో జింక దాగుంది.. 10 సెకన్లలో కనిపెడితే మీరే జీనియస్.. మీ కళ్లల్లో మ్యాజిక్ ఉన్నట్లే! | Brain Stroming Optical Illusion: Can you spot the Hidden Deer within 10 seconds, Internet Amazed To Find It Out
ఇప్పుడంతా ఫాస్ట్ జనరేషన్ కాబట్టి.. ప్రతీ ఒక్కరికీ సవాళ్లు ఎదుర్కోవడం అంటే చాలా ఇష్టం. అందుకేనేమో..
లైఫ్‌ను లీడ్ చేసేటప్పుడు.. మనకు పజిల్స్ ఎదురవుతున్నప్పుడే.. మనకు కిక్కు ఉంటది. అలాగే చేసే ప్రతి పనిలోనూ ఓ సవాల్ అంతర్లీనంగా ఉన్నప్పుడే.. ఆ వర్క్‌లో మజా ఉంటుంది. ఇక ఇప్పుడంతా ఫాస్ట్ జనరేషన్ కాబట్టి.. ప్రతీ ఒక్కరికీ సవాళ్లు ఎదుర్కోవడం అంటే చాలా ఇష్టం. అందుకేనేమో.. సోషల్ మీడియాలో అలాంటివారి అభిరుచికి తగ్గట్టుగా ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, ఫోటో పజిల్స్ ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. వీటికంటూ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో ప్రత్యేకంగా పేజీలు కూడా ఉన్నాయి.
ఫోటో పజిల్స్.. వీటిల్లో పైకి కనిపించే చిత్రాలు ఒకటి.. లోపల దాగున్న ఫోటోలు మరొకటి. అవి ఏంటో కనుక్కోవాలంటే మన బుర్రకు పదునుపెట్టాల్సిందే. ఎందుకంటే ఈ ఫోటో పజిల్స్ చాలాసార్లు మేధావులను సైతం పప్పులో కాలేసేలా చేస్తాయి. అలాంటి కోవకు చెందిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటో చూసేద్దాం..
పైన పేర్కొన్న ఫోటోను ఓ లుక్కేయండి. ఏం కనిపిస్తోంది.? వాలుగా ఉన్న పర్వత శ్రేణి.. దానిపై లెక్కలేనన్ని రాళ్లు.. అంతేగా.. కరెక్టే మీరు అనుకునేది. అయితే అక్కడే.. ఓ మూలనూ.. లేకపోతే మధ్యలోనూ.. లేదంటే.. కుడిపక్కన.. లేదా ఎడమ పక్కన.. ఓ జింక దాగుంది. అది ఎంచక్కా సేద తీరుతోంది. దాన్ని మీరు కనిపెట్టాలి. ఫోటోను పైపైన చూడకుండా.. నిశితంగా పరిశీలిస్తే మీకు జింక దొరుకుతుంది. లేట్ ఎందుకు మీరూ ఓసారి ట్రై చేయండి. ఒకవేళ సమాధానం దొరక్కపోతే కింద ఫోటో చూడండి..
here is the answer pic.twitter.com/gAKESGft1o
— telugufunworld (@telugufunworld) August 1, 2022
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..
లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి