Viral: లేట్ వచ్చాడని ఉద్యోగం నుంచి పీకేశారు.. కంపెనీపై కోపంతో మిగతా ఎంప్లాయిస్ ఏం చేశారో తెలిస్తే! | Employee fired for being late for first time in 7 years, his colleagues decide to go late every day until he’s rehired
అప్పుడప్పుడూ ఆఫీస్‌కు లేట్ అవ్వడం సర్వసాధారణం. అయితే లేట్‌గా వచ్చామన్న కారణంగా ఉద్యోగం పోతే..
అప్పుడప్పుడూ ఆఫీస్‌కు లేట్ అవ్వడం సర్వసాధారణం. అయితే లేట్‌గా వచ్చామన్న కారణంగా ఉద్యోగం పోతే.. ఇదేంటి అని అనుకుంటున్నారా.? ఖంగారుపడకండి.. అసలు స్టోరీ వినండి. ఓ వ్యక్తి ఏడేళ్లలో ఒకే ఒక్కసారి లేట్‌గా ఆఫీస్‌కు వచ్చాడు. ఇక అదే రీజన్ పెట్టుకుని అతడ్ని ఉద్యోగం నుంచి పీకేసింది ఆ కంపెనీ.. దీనితో మిగతా ఎంప్లాయిస్ ఏం చేశారో తెలిస్తే ఫ్యూజులు ఎగురుతాయి. ఆ కథేంటంటే.!
వివరాలలో వెళ్తే.. ‘ఏడేళ్లలో ఎప్పుడూ కూడా లేట్‌గా రాని ఓ వ్యక్తిని.. అదే రీజన్‌గా తీసుకుని ఉద్యోగం నుంచి తొలగించింది ఓ కంపెనీ. అతడి తన సహోద్యోగులు తోడుగా నిలిచారు. తనను మళ్లీ ఉద్యోగంలోకి రీ-జాయిన్ చేసుకునేవరకు తామందరం ప్రతీ రోజూ 20 నిమిషాల లేట్‌గా ఆఫీస్‌కు వెళతామంటూ మిగతా ఎంప్లాయిస్ కంపెనీపై తమ కోపాన్ని ఈ విధంగా చూపించారు’ ఇంతకీ ఆ ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి ఎవరు.? ఆ కంపెనీ ఎక్కడ ఉంది.? ఘటన ఎక్కడ జరిగింది.? అనే విషయాలు మాత్రం తెలియవు. ఓ రెడిట్ యూజర్ ఈ పోస్ట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తించారు.
‘నేను కూడా ఆఫీస్‌కు ఒకసారి లేట్‌గా వెళ్ళాను.. నన్ను ఉద్యోగం నుంచి పీకేయలేదు గానీ.. మరోసారి లేట్ రాకూడదని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘ట్రాఫిక్ వల్ల లేట్ అవుతోందని.. మా బాస్‌కి మెసేజ్ పెడితే.. నో ఇష్యూ.. డోంట్ వర్రీ అని చెప్పారు’ అంటూ మరొకరు రాసుకొచ్చారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..