News

Viral‌: జైలు‌లోని ఖైదీతో ఇద్దరు యువతుల శృంగారం.. కట్ చేస్తే చివరికి సీన్ రివర్స్.. | Two women officers fell in love with the same prisoner in jail, used to make relationships in the barracks


టైటిల్ చూసి ఆశ్చర్యపోకండి.. అసలు విషయం తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఓ ఇద్దరు యువతులు..

టైటిల్ చూసి ఆశ్చర్యపోకండి.. అసలు విషయం తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఓ ఇద్దరు యువతులు.. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీని ప్రేమించారు. ఆ వ్యక్తితో వీరిద్దరూ శారీరిక సంబంధాన్ని కూడా పెట్టుకున్నారు. చివరికి ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో సీన్ కాస్తా రివర్సయింది. బ్రిటన్‌లో జరిగిన ఈ ఘటన వెనుక అసలు కథేంటంటే..?

వివరాల్లోకి వెళ్తే.. వేల్స్‌లోని బ్రిడ్జెండ్ జైలులో ఆలిస్ హిబ్స్ అనే యువతి నర్సుగా, రూత్ ష్మా అనే యువతి జైలు ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఇద్దరూ కూడా అదే జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీతో ప్రేమలో పడ్డారు. అంతేకాదు అతడితో శారీరిక సంబంధాన్ని కూడా పెట్టుకున్నారు. అంతా తాము అనుకున్నట్లుగానే జరుగుతోందని భావించిన ఆ ఇద్దరికీ ఉన్నతాధికారులు షాక్ ఇచ్చారు. విషయమంతా పై అధికారులకు తెలియడంతో ఈ ఇద్దరు యువతులను అరెస్ట్ చేసి కోర్టులో నిలబెట్టారు.

కాగా, ఈ కేసు కోర్టులో విచారణకు వచ్చింది. యువతులిద్దరూ బాధ్యతాయుత ఉద్యోగాలు చేస్తూ.. ఖైదీతో శారీరిక సంబంధాన్ని పెట్టుకుని జైలు వ్యవస్థను అపహాస్యం చేశారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. వాదోపవాదనలు విన్న కోర్టు.. విచారణను సెప్టెంబర్‌కు వాయిదా వేసింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button