Vice President Election 2022 Live: ప్రారంభమైన ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్.. జగదీప్ ధన్కర్- మార్గరెట్ ఆల్వా పోటీ.. క్రాస్ ఓటింగ్‌కు ఛాన్స్.. | Vice Presidential Election 2022 Voting, Counting and Result Live Updates in telugu Voting for vice president of India, Jagdeep Dhankar, Margaret Alva, NDA, UPA, Vice President Poll Result Live news
Vice Presidential Poll 2022 Live Updates in Telugu: భారత కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఓటింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (NDA) అభ్యర్థి జగదీప్ ధన్కర్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వా మధ్య పోటీ నెలకొంది

Vice Presidential Election
LIVE NEWS & UPDATES
06 Aug 2022 10:53 AM (IST)
ఓటింగ్‌కు దూరంగా తృణమూల్ కాంగ్రెస్.. కారణం ఇదే..
ఉభయ సభలలో (లోక్‌సభ,రాజ్యసభ) 36 మంది ఎంపీలతో పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ (TMC) రెండవ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ. అయితే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఓటింగ్ ప్రక్రియకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. అల్వా పేరును ప్రకటించకముందే ఏకాభిప్రాయానికి ప్రయత్నించలేదని టీఎంసీ ఆరోపించింది. దీంతో ఆ పార్టీ ఓటింగ్‌కు దూరంగా ఉంది.
06 Aug 2022 10:46 AM (IST)
Advertisementఓటు వేసిన ప్రధాని మోదీ..
ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi casts his vote for the Vice Presidential election, at the Parliament pic.twitter.com/cJWlgGHea7
— ANI (@ANI) August 6, 2022
06 Aug 2022 10:43 AM (IST)
ఉపరాష్ట్రపతి ఎన్నికకు ప్రారంభమైన ఓటింగ్
ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్ ప్రారంభమైంది. పార్లమెంట్ భవన్‌కు చేరుకుంటున్నారు ఎంపీలు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎంపీలు క్యూ లైన్లో నిలుచున్నారు. అందరికంటే ముందే పోలింగ్ సెంటర్ వద్దకు చేరుకున్నారు ప్రధాని మోదీ.
#JagdeepDhankhar vs #MargaretAlva | Voting for the Vice Presidential election begins.
Votes will be counted today itself and the next Vice-President will take the oath of office on August 11 – a day after the term of the incumbent Vice President M Venkaiah Naidu ends. pic.twitter.com/bm2ILH5dYz
— ANI (@ANI) August 6, 2022
జగదీప్ ధన్కర్ వర్సెస్ మార్గరెట్ అల్వా.. ఈ ఇద్దరిలో కొత్త ఉపరాష్ట్రపతి ఎవరు..? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. భారత కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఓటింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (NDA) అభ్యర్థి జగదీప్ ధన్కర్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వా మధ్య పోటీ నెలకొంది. లెక్కలు నమ్మితే పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధంకర్ బంపర్ విజయం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈసారి రాష్ట్రపతి ఎన్నికల మాదిరిగానే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ విపక్షాలు క్రాస్ ఓటింగ్ చేస్తాయో లేదో చూడాలి. సహజంగానే ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో విపక్ష శిబిరంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. కాబట్టి క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఉభయ సభలలో (లోక్‌సభ,రాజ్యసభ) 36 మంది ఎంపీలతో పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ (TMC) రెండవ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ. అయితే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఓటింగ్ ప్రక్రియకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. అల్వా పేరును ప్రకటించకముందే ఏకాభిప్రాయానికి ప్రయత్నించలేదని టీఎంసీ ఆరోపించింది. దీంతో ఆ పార్టీ ఓటింగ్‌కు దూరంగా ఉంది.
Published On – Aug 06,2022 10:44 AM