Entertainment

Bedurulanka: ‘బెదురులంక 2012’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న ‘వెన్నెల్లో ఆడపిల్ల’ రొమాంటిక్ సాంగ్ విన్నారా ?..


ప్రొడ్యుసర్ రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులలో క్యూరియాసిటి నెలకొంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి మంగళవారం ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్.

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కార్తికేయ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం బెదురులంక 2012. ఇందులో కార్తికేయ సరసన డిజే టిల్లు ఫేమ్ హీరోయిన్ నేహా శెట్టి కథానాయికగా నటిస్తుండాగా.. ఈ చిత్రానికి క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ గ్లింప్స్ ఆకట్టుకుంది. ప్రొడ్యుసర్ రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులలో క్యూరియాసిటి నెలకొంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి మంగళవారం ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్.

వెన్నెల్లో ఆడపిల్ల.. కవ్వించే కన్నెపిల్ల అంటూ సాగే ఈ బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్ ఆకట్టుకుంటుంది. ఈ పాటకు మణిశర్మ సంగీతం అందించగా.. హారిక నారాయణ్, సుదాన్షు జేవీ ఆలపించగా.. కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించారు. ఈ పాటలో హీరోహీరోయిన్ లవ్లీ కెమిస్ట్రీని ప్రదర్శించింది.

ఈ చిత్రాన్ని లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఇందులో శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రామ్ ప్రసాద్, అజయ్ ఘోష్, వెన్నెల కిషోర్, సత్య, గోపరాజు రమణ, రాజ్ కుమార్ కసిరెడ్డి, ఎల్ బీ శ్రీరామ్, తదితరులు కీలకపాత్రలలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

ఇవి కూడా చదవండి





మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisement

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Articles

Back to top button