Veera Simha Reddy: భ్రమరాంబ థియేటర్ వద్ద ఫ్యాన్స్ హంగామా.. బాలయ్య, గోపి చంద్ చిత్ర యూనిట్ సందడి
తెలంగాణ ప్రభుత్వం ఐదో షోకి అనుమతి ఇవ్వడంతో.. తెల్లవారుజామున 4 గంటల నుంచే షోలు మొదలయ్యాయి. దీంతో థియేటర్స్ వద్ద అభిమానుల కోలాహలం ఓ రేంజ్ లో సాగింది.

Balakrishna At Kukatpalli
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా గోపి చంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన వీరసింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి పండగను అభిమానులకు రెండు రోజుల ముందే తెచ్చింది ఈ మూవీ. తెలంగాణ ప్రభుత్వం ఐదో షోకి అనుమతి ఇవ్వడంతో.. తెల్లవారుజామున 4 గంటల నుంచే షోలు మొదలయ్యాయి. దీంతో థియేటర్స్ వద్ద అభిమానుల కోలాహలం ఓ రేంజ్ లో సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా వీర సింహా రెడ్డి రిలీజైన థియేటర్ల వద్ద బాలకృష్ణ ఫ్యాన్స్ సందడి నెలకొంది.
మరోవైపు భాగ్యనగరంలోనూ పలు థియేటర్స్ వద్ద అభిమానులతో పాటు పలువురు సెలబ్రెటీలు సందడి చేశారు. ముఖ్యంగా కూకట్ పల్లి భ్రమరాంబ థియేటర్ వద్ద అభిమానుల కోలాహలం ఓ రేంజ్ లో సాగింది. సంక్రాంత్రి సంబరాలను దీపావళి అన్న రేంజ్ లో చేశారు. క్రాకర్స్ కాలుస్తూ.. డప్పులు, డ్యాన్స్ లతో హంగామా సృష్టించారు. థియేటర్ వద్ద బాలయ్య బాబు,గోపి చంద్ మలినేని సహా చిత్ర యూనిట్ ఫ్యాన్స్ తో కలిసి సందడి చేశారు.
మరోవైపు వీరసింహా రెడ్డి మూవీ అడ్వాన్స్ బుకింగ్ లోనూ అదరగొట్టింది. వాస్తవంగా చెప్పాలంటే… బాలయ్య సినిమాకు ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్ ఇదే మొదటిసారి. అడ్వాన్స్ బుకింగ్ తో హైదరాబాద్లో 11.42 లక్షలు, బెంగళూరులో 30 లక్షలు, చెన్నైలో 4 లక్షలు, వరంగల్లో 17.58 లక్షలు, ముంబైలో 1.52 లక్షల రూపాయలు సొంతం చేసుకుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..