Veera Simha Reddy Pre Release Event Live: గ్రాండ్గా బాలకృష్ణ వీరసింహారెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్..
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నటసింహ నందమూరి బాలకృష్ణ -గోపీచంద్ మలినేని కాంబినేషన్..

Veera Simha Reddy
LIVE NEWS & UPDATES
06 Jan 2023 05:36 PM (IST)
ఘనస్వాగతం పలికిన ఫ్యాన్స్
బాలకృష్ణకు ఘనస్వాగతం పలికిన అభిమానులు.. ఫ్యాన్స్ తో ఫోటోలు దిగిన బాలకృష్ణ
06 Jan 2023 05:34 PM (IST)
Advertisementఒంగోలు చేరుకున్న బాలయ్య
హెలికాఫ్టర్ లో ఒంగోలు చేరుకున్న బాలయ్య, శ్రుతిహాసన్ .
నటసింహం నందమూరి హీరో బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న సినిమా వీరసింహారెడ్డి . బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది ఈ మూవీలో బాలయ్యకు జోడీగా శ్రుతిహాసన్ నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బాలకృష్ణ -గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తోన్న ‘వీరసింహారెడ్డి’ కోసం నందమరి ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా జనవరి 12 విడుదలవుతోంది. ఇప్పటికే విడుదలైన ‘వీరసింహారెడ్డి’ చిత్రంలోని జై బాలయ్య, సుగుణ సుందరి, మా బావ మనోభావాలు.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
తాజాగా వీరసింహారెడ్డి సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఒంగోలు లో గ్రాండ్ గా జరుగుతోంది. ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు. భారీ ఎత్తున్న ఈ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ ఒంగోలుకు చేరుకున్నారు.
Published On – Jan 06,2023 5:32 PM