Vastu Tips: పసుపు ఆరోగ్యానికే కాదు.. ఇంటికి కూడా మేలు చేస్తుంది.. ఎలాగంటే.. – Telugu News | Vastu tips with turmeric to improve positive energy in home
పసుపు లేకుండా ఏ వంటకాన్ని చేయలేమని తెలిసిందే. ప్రతీ వంటకంలో పసుపు ఉండాల్సిందే. ఇక పసుపులో ఉండే ఔషధ గుణాలు ఆరోగ్యాన్ని ఎంతలా మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పసుపు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది యాంటీ బయోటిక్. అంటే రోగాలను నయం చేయడంలో పసుపు కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే గాయమైన వెంటనే పసుపు రాసుకోమని చెబుతుంటారు.
ఇక పసుపు కేవలం ఔషధాల గుణాలకే కాకుండా జ్యోతిష్య శాస్త్రంలోనూ ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతీ పూజలో కచ్చితంగా పసుపు ఉండాల్సిందే. ఏ శుభకార్యమైనా పసుపును కచ్చితంగా ఉపయోగిస్తారు. అంతలా జ్యోతిష్య శాస్త్రంలో పసుపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉంటే ఆరోగ్యానికి మేలు చేసే పసుపు ఇంటి వాస్తులో కూడా ముఖ్యపాత్ర పోషిస్తుందని మీకు తెలుసా.? అవును పసుపుతో కొన్ని రకాల వాస్తు దోషాలకు చెక్ పెట్టవచ్చని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటంటే..
* ఒకవేళ మీరు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే పసుపు ద్వారా వాస్తును సరిదిద్దుకోవచ్చు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా.. పసుపును ఒక ముద్దలా చేసి రెడ్ కలర్ వస్త్రంలో కట్టాలి. అనంతరం ఆ వస్త్రాన్ని మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. డబ్బు వృథాగా ఖర్చవుతున్నా, సంపాదించింది అంతా నీళ్లలా ఖర్చవుతున్న వారికి ఈ వాస్తు చిట్కా బాగా ఉపయోగపడుతుంది. ఇలా క్రమంతప్పకుండా చేస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు దూరమవుతాయి.
* ఇక ఇంటి ఎయిన్ డోర్ వద్ద పసుపుతో స్వస్తిక్‌ను గీస్తే వాస్తు పరంగా ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోతాయని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఇంట్లో నిత్యం పాజిటివ్ ఎనర్జీ ఉండేలా ఉపయోగపడుతుంది. ఇంట్లో నిత్యం గొడవలు, మానసిక ప్రశాంతత కరువైన వారు ఇలా చేస్తే మంచి ప్రతి ఫలం ఉంటుంది. ఈ స్విస్తిక్ ఈ ఇంటి దారానికి కుడివైపులా ఉండేలా చూసుకోవాలి.
* ఇంటి ప్రధాన ద్వారం వద్ద ప్రతి రోజూ పసుపు నీటిని చల్లడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద పసుపు కలిపిన నీటిని చల్లడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించేందుకు ఉపయోగపడుతుంది. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి ఇదొక మంచి వాస్తు చిట్కాగా చెప్పొచ్చు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు జ్యోతిష్య పండితుల అభిప్రాయాలు, సలహాల నుంచి సేకరించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్న రీడర్స్ గమనించాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..